ఏప్రిల్ నెల పన్నుల్లో భాగంగా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాను కేంద్రం విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కలిపి 46వేల 38 కోట్లు రూపాయలు విడుదల చేయగా అందులో తెలంగాణకు రూ. 982 కోట్లు, ఆంధ్ర ప్రదేశ్‌కి రూ.1,892.64 కోట్ల రూపాయలు లభించాయి.
కరోనా వైరస్ (Coronavirus) ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తున్న తరుణంలో ఒకరి నుండి మరొకరు సోషల్ డిస్టన్సింగ్ (Social distancing) మెయింటేన్ చేయాల్సిందిగా కేంద్రం పిలుపునిచ్చింది. అలాగే జనం ఎక్కడా గుంపులు గుంపులుగా ఉండకూడదని.. సమూహాలుగా తిరిగే చోట వైరస్ ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు (WHO experts) సైతం విజ్ఞప్తిచేస్తున్నారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు సందర్భంగా మార్చి 11 వరకు నామినేషన్స్ స్వీకరించిన సంగతి తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నేడు మార్చి 12న నామినేషన్స్ పరిశీలన జరగనుండగా.. మార్చి 14వ తేదీ నామినేషన్స్ ఉపసంహరణకు చివరి తేదీ కానుంది. ఈ నేపథ్యంలో 13 జిల్లాల జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల పరిధిలో దాఖలైన నామినేషన్ల వివరాలను తాజాగా ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల సందర్భంగా రెండు రోజులు సెలవు దినాలుగా ప్రకటిస్తూ ఏపీ సర్కార్ ఓ ప్రకటన విడుదల చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీకి (PM Narendra Modi), ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి (AP CM YS Jagan) కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు (KVP) లేఖలు రాశారు. ఢిల్లీలో తన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేవీపీ మాట్లాడుతూ.. ఆ లేఖల్లోని సారాంశాన్ని వెల్లడించారు.
ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. వెంకటేశ్వరావుపై (AB Venkateshwar Rao) ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను ఖరారు చేస్తూ కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. రాజకీయ పగల దృష్ట్యానే తనను అకారణంగా సస్పెండ్ చేశారని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT)ను ఆశ్రయించిన ఏబీ వెంకటేశ్వర రావుకి ఇది ఊహించని షాక్.
ఏపీ సర్కార్ ఇల్లు లేని నిరుపేదలకు గుడ్ న్యూస్ వినిపించింది. ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద 25 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ ప్రక్రియ ప్రారంభించేందుకు ఏపీ సర్కార్ సర్వం సిద్ధం చేసింది.
ఆంధ్ర ప్రదేశ్‌కి మూడు రాజధానుల ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేస్తూ పాత చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన ఏపీ సర్కార్.. త్వరలోనే ఏపీ ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ విశాఖపట్నంకు సచివాలయాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలు, పరీక్షలు పూర్తి అయిన తర్వాత ఏపీ సచివాలయాన్ని వైజాగ్‌కు తరలించాలని ఏపీ సర్కార్ భావిస్తున్నట్టు సమాచారం.
ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ( RIL) అధినేత ముఖేశ్ అంబానీ భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ముఖేష్ అంబానీ వెంట ఆయన కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ సభ్యుడు, పారిశ్రామికవేత్త ఎంపీ పరిమళ్ నత్వానీ కూడా ఉన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన విలీనం హామీని నెరవేర్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి గత శాసన సభ సమావేశాల్లో విలీన ప్రక్రియ బిల్లును ప్రవేశపెట్టగా.. ఆ బిల్లుకు అసెంబ్లీ వెంటనే ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించిన దిశా చట్టానికి దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తున్నాయి. ఇలాంటి చట్టం రూపొందించినందుకు ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు, మహిళా సంఘాలు, సామాజిక సంస్థలు తమ హర్షాన్ని వ్యక్తం చేశాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఏపీలో జన్మించడమే దురదృష్టకరమని విజయసాయి రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు.
ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో చార్జీలు పెంచనున్నట్టు ఇటీవలే ఏపీ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా పెంచిన ఛార్జీలు రేపటి నుంచే అమలులోకి రానున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ స్పష్టంచేసింది. ఈమేరకు సవరించిన చార్జీల వివరాలను తెలియజేస్తూ.. ఏపీఎస్ఆర్టీసీ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణలోని అగ్రిగోల్డ్ బాధితులందరికి(Agrigold victims) తప్పకుండా డబ్బులు వస్తాయని ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదని బాధితులకు ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి మహమూద్ అలీ భరోసా ఇచ్చారు.
ఏపీలో తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఎన్జీవో(AP NGOs)లు రోడ్డెక్కారు. బందరు రోడ్ పంచాయతీ రాజ్ కార్యాలయం వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన(AP NGOs protests) వ్యక్తం చేసిన ఎన్జీవోలు.. న్యాయమైన సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని, ప్రభుత్వాలు కమిటీలతో కాలయాపన చేస్తున్నాయని ఆరోపించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.