Brahmamudi Today December 23 Episode: సోమవారం ఎపిసోడ్లో ఆఫీస్‌లో బ్యాంక్ అధికారులు కావ్య ఇన్స్టాల్మెంట్లో డబ్బులు కట్టడానికి ఒప్పుకుంటారు. ఆరోజే రూ.20 కోట్లు పే చేస్తామని ఒప్పిస్తుంది. డాక్యుమెంట్లు తయారు చేసి ఇన్ఫామ్ చేస్తాం. వచ్చి డబ్బులు కట్టండి అని వెళ్లిపోతారు బ్యాంకు అధికారులు.
Brahmamudi Today December 21 Episode: నేటి ఎపిసోడ్లో రాజ్ కావ్య రూ.100 కోట్లు షూరిటీ విషయం చెప్పేస్తాడు. కావ్యను దగ్గరకు తీసుకుని చేతులు పట్టుకుంటాడు. కళ్లలోకి దీనంగా చూస్తూ ఈ విషయం మన మధ్యలో ఉండాలి. ఎవరికీ చెప్పకూడదు అంటాడు.
Brahmamudi Today December 20th Episode: ఇక అప్పు కవితో బాగోగులు మాట్లాడుతూ ఉంటుంది. ఒకసారి విజిట్ చేయి అని అడుగుంది. కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి. వాటిని చూసుకుని వస్తా అంటాడు. అక్కడ నువ్వు ఎంత కష్టపడుతున్నావో నేను కూడా ఇక్కడ అంత కష్టపడుతున్న అంటాడు. నేను లేను కదా అని ఇంకెవరినైనా ట్రై చేస్తున్నావా? నిజం చెప్పు అంటుంది. సర్లే నాకు అంత ధైర్యం లేదు నేను మళ్లీ ఫోన్ చేస్తా అని పెట్టేస్తాడు. అప్పుకూ ఏదో డౌట్ కొడుతుంది.
Brahmamudi Today December 19th Episode: చచ్చినా ఈ ఇల్లు ఖాళీ చేయమని బ్యాంకు అధికారులతో వారిస్తుంది రుద్రాణీ. తెలివిలేక ఏదో మాతాత రాసిస్తే మాకేం సంబంధం, ఆయనకు మతి స్థిమితం లేదు అంటాడు రాహుల్. తల వంచేదే లేదు, తల దించేదే లేదు అంటుంది ధాన్యం. మీ తాత మాటకు కట్టుబడి ఉంటే అడుక్కుతినాలి. మా వాట మేం దక్కించుకోవడానికి కోర్టుకు వెళ్తాం అంటారు రుద్రాణీ, ధాన్యలక్ష్మిలు..
Brahmamudi Today December 18th Episode: ఈరోజు ఎపిసోడ్లో అపర్ణతో కావ్య ఇంటి బాధ్యతలు వద్దూ అని చెబుతుంది. ఇనుపెట్టే ఖాళీ చేస్తున్నారు. నాకొద్దు అత్తయ్య ఈ భారం అని దండం పెడుతుంది. చేయి కాల్చుకోకుండా వంట చేయడమే నేర్చుకోవాలి. ఈ మాత్రానికి బెదిరిపోతే ఎలా? అలవాటు అవుతుంది అంటుంది అపర్ణ....
Brahmamudi Today December 17th Episode: ఎపిసోడ్లో సీతారామయ్యగారు చదివించే అబ్బాయి కుటుంబం వస్తుంది. దీంతో రుద్రాణీ పేదవారు, గతిలేనివారు అంటూ వెళ్లగొడుతుంది. రాజ్ ఇతర కుటుంబ సభ్యులు వారిస్తారు. రాహుల్‌నే చదివించగా లేనిది దారిన పోయే వారికి దానం చేస్తే ఏంటత్తయ్యా అంటుంది స్వప్న..
Brahmamudi Today December 16th Episode: నేటి ఎపిసోడ్లో రాజ్ రోడ్‌పై పరధ్యానంతో నడుస్తుంటాడు. డ్రైవర్ వచ్చి కార్ ఎక్కించుకుపోతాడు. అప్పుడు ఫోన్లో రాజ్ తన ఫోలీస్ ఫ్రెండ్‌తో మాట్లాడుతాడు. ఆ చిట్‌ఫండ్ కంపెనీ వివరాలు తెలుసుకోమంటాడు. మరోవైపు కావ్యకు ఇంటి కష్టాలు మొదలవుతాయి.
Brahmamudi Serial Today December 14th Episode: ఈరోజు ఎపిసోడ్ కొనసాగుతుంది.. హాల్లో అందరూ ఉంటారు. కనకం పరామర్శించడానికి వస్తుంది. ఉండలేక వచ్చాను మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే క్షమించు అంటుంది కనకం.. ఇంట్లోవారే ఆయన చావును కోరకుంటున్నారు. చివరిరోజుల్లో మాకు ఈ శోకం ఎందుకో అంటుంది ఇందిరా దేవి.
Brahmamudi Today December 13th Episode: నేడు ఎపిసోడ్ కొనసాగుతుంది... కావ్య కృష్ణయ్యతో భారం మీద పడిందని మొరపెట్టుకుంటుంది. గోవర్ధనగిరీ కంటే బరువు ఈ బాధ్యత నా వల్ల అవుతుందా? ఇంత బరువు నా నెత్తిన పెట్టి నడవమంటావా? అని అడుగుతుంది. నీకు ఏది ఇవ్వాలో ఆ పరమాత్ముడికి తెలుసు అంటుంది ఇందిరా దేవి. నీకు ఏది ఎప్పుడు కావాలో ఆయనకు తెలుసు అంటుంది.
Brahmamudi Today December 12th Episode: ఎపిసోడ్ కొనసాగుతుంది. బెడ్రూంలో రాజ్, కావ్యలు ఆస్తి పంపకాలపై గొడవలు పడుతుంటారు. ఆస్తి పంచకూడదు అని కావ్య, ఏంచేయమంటావ్ ఎవ్వరూ వినకుంటే అని రాజ్ వాగ్వాదం చేస్తుంటారు. తాతయ్య అతనికి నచ్చిన నిర్ణయాలు తీసుకున్నారు. నేడు ఆస్తుల విషయంలో ఇదే జరుగుతుంది. ఈ ఇంటి వారసుడిని అని నువ్వు గుర్త చేసేవరకు నాకు తెలియడం లేదు అంటాడు.
Brahmamudi Today December 11 Episode: రుద్రాణీ, రాహుల్‌లు ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టే పనిలో ఉంటారు. తాతయ్యను ఎదిరించి నిలబడింది ఆఫ్ట్రాల్ రాజ్‌కు భయపడుతుందా? అని రెచ్చగొడతాడు రాహుల్. ఇపుడేంటి రూ.2 కోట్లు చెక్‌పై రాజ్ చేత సంతకం పెట్టించాలి అంతేకదా? అంటుంది ధాన్యం. మాటలు చెబుతుంది కానీ, వెళ్లి అడిగే ధైర్యం మాత్రం చేయదు అంటుంది రుద్రాణీ. దీంతో చెక్ లాక్కొని రాజ్ వద్దకు వెళ్తుంది.
Brahmamudi Today December 10 Th Episode: నేటి ఎపిసోడ్లో కావ్య వంటగదిలో పడుకుని ఉందని అపర్ణ రాజ్‌ను నిలదీస్తుంది. అంత మానవత్వం లేకుండా ఉన్నామా? అని కావ్యను వ్యతకారంగా అడుగుతాడు రాజ్. ఎవరైనా చూస్తే ఎంత అవమానం, మీ తాతయ్య నానమ్మ తీసుకువచ్చారు. నీ భార్య నీ ఇంటికి తిరిగివస్తే అలా చేస్తావా? అంటుంది అపర్ణ. రాకూడదని అని చెప్పానా? అంటాడు రాజ్. రమ్మను తలుపు తెరిచే ఉంది కదా అని వెళ్లిపోతాడు. అయినా కావ్య సంకోచిస్తుంది. అపర్ణ ఒప్పించి పంపిస్తుంది.
Brahmamudi December 9 Episode: అందరూ కలిసి నా నోరు నొక్కేయాలని చూస్తున్నారు అంటూ ఉండగా ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకున్న ఇందిరా దేవి ఆపండి.. అసలు ఎవరు మీరంతా? ఇన్నాళ్లు ఈ ఇంట్లో ఉన్నవారేనా? అంటుంది. ఇలాంటి కుటుంబంలో ఎలాంటి వారు తయారయ్యారు. ఇంటి పెద్దకు ఆపద వస్తే అందరూ కలిసి ఎలా కాపాడుకోవాలని ఆరాటపడతారు. ఆయనకు ఏదైనా అయితే, ఆస్తులు ఎలా దక్కించుకోవాలని ఆలోచిస్తున్నారా?
Brahmamudi December 7Th Episode Today: అసలే బ్యాడ్ టైం నడుస్తుంటే ఈ ముసలోడు మనల్ని అన్యాయం చేస్తాడా? టాటా.. బైబై చెబుతాడా ఏంట్రా అని రాహుల్‌తో రుద్రాణి అంటుంది. అప్పుడే కవి పరుగెత్తుకుంటూ ఆస్పత్రిలోకి వస్తాడు. తాతయ్యకు ఎలా ఉంది అని రాజ్‌ను అడుగుతాడు వాళ్లు ఇంకా ఏం చెప్పలేదురా అంటాడు రాజ్.. అసలెందుకు ఇలా జరిగింది అంటాడు కొంతమంది బుద్ధిలేకుండా ప్రవర్తించినందుకు.. ముర్ఖాత్వం పరాకాష్టకు చేరినప్పుడు అంటుంది అపర్ణ. వదిలేయ్ అంటాడు సుభాష్ అంతకు మించి నేను చేయగలిగింది ఏంటండి?.. మావయ్య ఏరోజు సంతోషంగా ఉన్నారు? ఎంతమందికి సర్ధిచెబుతారు అంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.