దేశ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తూ.. రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. కాగా కరోనా భూతం ప్రబలుతున్న తరుణంలో ఎక్కువ మంది ఒకే చోట చేరవద్దంటూ ఇప్పటికే ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నాయి. మరోవైపు పౌరసత్వ సవరణ చట్టం
జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్)లో ప్రతిపాదించబడ్డ వివాదాస్పద ప్రశ్నలను మినహాయించాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు. ఏప్రిల్ 1న ప్రారంభమయ్యే
గతంలో ఏదైనా ఫిర్యాదు వస్తే కేవలం ఆ సంస్థకు నోటీసులు పంపి వీడియోలు డిలీట్ చేయించేవారు. కానీ అందుకు భిన్నంగా తొలిసారిగా తెలంగాణలో టిక్ టాక్, ట్విట్టర్, వాట్సాప్లపై కేసు నమోదైంది.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఢిల్లీ హింస వెనుక ఎవరి హస్తం ఉంది ? ఆప్ నేత మద్దతుతోనే అల్లరిమూకలు హింసకు పాల్పడ్డాయా ? రాళ్లు రువ్వుతూ విధ్వంసానికి పాల్పడిన అల్లరి మూకలకు ఆప్ నేత తాహిర్ హుస్సేన్ ఆశ్రయం ఇచ్చారా ? తాహిర్ హుస్సేన్ ఇంటిపైకప్పుపై పెట్రోల్ బాంబులు, రాళ్లు, ఇటుక పెళ్లలు, సీసాలు ఎందుకున్నాయి ? ఢిల్లీ అల్లర్లలో ఎంత మంది చనిపోయారు ? ఢిల్లీ హింసలో అసాంఘీక శక్తులు ప్రవేశించాయా ? అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
దేశ రాజధానిలో చెలరేగుతున్న అల్లర్లపై, మత హింసను ఓ వర్గం ప్రేరేపిస్తుందన్న ఆరోపణలపై భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నిప్పులు చెరిగారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర శాసనసభ 2020 వార్షిక బడ్జెట్ సమావేశాలు మార్చి 6వ తేదీన ప్రారంభం కానున్నాయని, ఈ సమావేశాలు రెండు వారాలపాటు జరగనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ బెంగళూరులో నిర్వహించిన ర్యాలీలో పాకిస్థాన్ జిందాబాద్ అంటూ ఓ యువతి నినాదాలు చేయడం కలకలం రేపింది. ఆ సమయంలో అసదుద్దీన్ ఒవైసీ వేదికమీద ఉన్నారు.
సీఏఏ, ఎన్ఆర్సీ కోసం ఎవరైనా పత్రాలు అడిగితే ఇవ్వొద్దని రాష్ట్ర ప్రజలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచించారు. మా రాష్ట్రంలో వెరిఫికేషన్ చేసే అధికారం బీజేపీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు.
పౌరసత్వ సవరణ చట్టం-2019కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజకీయ రంగు పులుముకున్న తర్వాత అధికారంలో ఉన్న బీజేపీ, మిగతా విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి), దేశంలోనే మొదటిసారిగా పౌర సంస్థగా అవతరించింది. కార్పొరేషన్ సమర్పించిన బడ్జెట్ను ఆమోదించడానికి జరిగిన జనరల్ బాడీ సమావేశంలో కౌన్సిల్ ఈ తీర్మానాన్ని ఆమోదించింది.
ఢిల్లీలోని షహీన్ బాగ్లో పౌరసత్వ సవరణ చట్టం-2019కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రోజూ వేలాది మంది నిరసనకారులు ఆందోళన నిర్వహిస్తున్నారు. దీనిపై కొద్ది రోజుల క్రితమే.. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర బడ్జెట్ దేశ ప్రజలకు అన్యాయం చేసే విదంగా ఉందని, ఆర్థిక మాంద్యాన్ని అధిగమించే విదంగా బడ్జెట్ లో అంశాలు లేవని కేంద్ర ప్రభుత్వంపై సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మండిపడ్డారు. ఇది ప్రజావ్యతిరేక, దేశ వ్యతిరేక బడ్జెట్ గా ఉందని, కేరళ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు తీవ్రమైన నష్టం జరిగిందని అయ్యాను అన్నారు.
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం -2019పై వ్యతిరేక ఆందోళనలు చెలరేగుతున్నాయి. CAA-2019, NRCని వ్యతిరేకిస్తూ వేలాది మంది రోడ్లపైకి వస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో రోజూ నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ రోజూ ఇవే ఆందోళనలతో అట్టుడుకుతోంది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ చట్టాలకు మా పార్టీ వ్యతిరేకమని వైఎస్ఆర్సీపీ లోక్సభ నాయకుడు మితున్ రెడ్డి అన్నారు. ఈ చట్టాలు దేశంలోని మైనారిటీలలో అభద్రతను పెంచాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్పిఆర్లో అడిగే సమాచారం గతానికి, ఇప్పుడున్న చట్టంలో భిన్నంగా ఉందని
కేరళ అసెంబ్లీలో ఈ రోజు వింత పరిణామం జరిగింది. అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పౌరసత్య సవరణ చట్టానికి సంబంధించిన విషయాన్ని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు .. కాస్తంత వెరైటీగా స్పందించారు.
ఎన్డీఏ సర్కార్ తీసుకొచ్చిన సీఏఏపై దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధానాన్ని సంతరించుకున్నాయి.
భారత దేశంలోని ప్రతి పౌరుడికి జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్సీ) వర్తిస్తుందని, కేవలం ఒక వర్గం కోసం పెట్టింది కాదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ‘జనసేన’ కార్యాలయంలో ఈరోజు సమావేశం నిర్వహించిన ఆయన, సమావేశానికి
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.