పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించిన నాల్గవ రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలిచిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీని ఉద్దేశించి మాట్లాడుతూ "పాకిస్తాన్ బ్రాండ్ అంబాసిడర్" గా
దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం 2019 బిల్లుకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ భవన్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం మాట్లాడుతూ.. తాము సీఏఏకు వ్యతిరేకంగా పార్లమెంటులో నిరసన తెలిపామని, త్వరలో భావసారూప్యత గల ముఖ్యమంత్రులతో సీఏఏకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
పౌరసత్వ సవరణ చట్టం (సీఎఎ)కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, సామాన్య ప్రజల పోరాటాన్ని ప్రశంసించిన నటి నందితా దాస్ గురువారం జైపూర్ లో జరిగిన లిటరేచర్ ఫెస్టివల్ (జెఎల్ఎఫ్) సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా షాహీన్ బాగ్ వంటి మరిన్నో ప్రదేశాలు ఏర్పడబోతున్నాయని ఆమె అన్నారు. సీఎఎ, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC)కు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలని నందితా దాస్
నిన్న లక్నో జరిగిన ర్యాలీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పై చర్చకు రావాలని సవాలు చేసిన ఒక రోజు తరువాత, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బుధవారం బీజేపీతో తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, కానీ అభివృద్ధి, నిరుద్యోగం,రైతు సమస్యలపై ముందు చర్చించాలన్నారు.
భారతదేశంపై మలేషియా ప్రధాని సంచలన వ్యాఖలు చేశారు.మలేషియా ప్రధాని మహతిర్ మొహమ్మద్ మాట్లాడుతూ భారత్ పై ప్రతీకారం తీర్చుకునేంత శక్తి మలేషియాకు లేదన్నారు. మలేషియా పశ్చిమ కోస్తా ప్రాంతంలోని లాంగ్కావి ద్వీపంలో
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి తారా స్థాయికి చేరుకుంది. పోలింగుకు ఇంకా నాలుగు రోజులే ఉండటంతో అన్నీ ప్రధాన పార్టీలు తమ ప్రచారాలన్నీ ఉదృతం చేశాయి. ఇందులో భాగంగా శనివారం కామారెడ్డిలో మజ్లీస్ నేత ఎంపీ అసదుద్దిన్ ఓవైసి మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను చిత్తు చిత్తుగా ఓడించండి అని అయన ఓటర్లకు పిలుపునిచ్చారు.
సీఏఏపై టెక్ దిగ్గజం, మెక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టంలోని అంశాలు బాధిస్తున్నాయని, సరైన నిర్ణయం కాదని.. అందరికీ ఒకే విధమైన చట్టాలు తీసుకురావాలని అభిప్రాయపడ్డారు.
సీఏఏపై అవాస్తవాలు ప్రచారం చేయాలని ఎవరెంత ప్రయత్నించినా... వారి ఆటలు సాగవని.. ఎందుకంటే పౌరసత్వ సవరణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బీజేపి శ్రేణులు ఎక్కడికక్కడ అవగాహన సదస్సులు, శిబిరాలు నిర్వహిస్తున్నాయని అమిత్ షా అన్నారు.
ప్రధాని మోదీ రెండు రోజుల పశ్చిమ బెంగాల్ పర్యటన సంధర్బంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో ప్రధాని నరేంద్రమోదీని కలిసిన మమతా బెనర్జీ.. పౌరసత్వ సవరణ చట్టం 2019 (సిఎఎ), జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సి), జాతీయ జనాభా పట్టిక ( NPR)ల అమలు ప్రక్రియను పున:పరిశీలించాలని కోరానని ఆమె అన్నారు.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు నిర్ణయం తరువాత కేంద్ర ప్రభుత్వం దేశ సరిహద్దు ప్రాంతాలపై ఫోకస్ చేస్తోంది. ఈ క్రమంలో సరిహద్దు వెంబడి ఉన్న కంచెను తొలగించి, కొత్తది ఏర్పాటు చేసే యోచనలో ఉంది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో జరగనున్నాయి. మొదటి దశ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 11 వరకు, రెండోదశ మార్చి 2 నుంచి ఏప్రిల్ 3 వరకు జరగనున్నాయి. ఈమేరకు పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చురలంటించారు. తాను భారత ముస్లిం అయినందుకు గర్వపడుతున్నానని పేర్కొన్నారు. భారత ముస్లింల గురించి ఆలోచించడం కన్నా పాకిస్థాన్ ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించడం ఉత్తమమని హితవు పలికారు.
పౌరసత్వ సవరణ చట్టం 2019, జాతీయ పౌర పట్టికలను వ్యతిరేకిస్తూ ఇందిరాపార్క్ వద్ద గల ధర్నాచౌక్‌లో ప్రజాస్వామ్య వాదులు, మైనార్టీలు ఆందోళన చేపట్టారు. మైనార్టీలను వేధింపులకు గురిచేసేలా ఉన్న పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ జెండాలతో వేలాది మంది పౌరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై, నగర కమిషనర్ అంజనీకుమార్‌పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఘాటుగా స్పందించారు. మంత్రి తలసాని శనివారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కేంద్రం అవలంభిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ 'దేశాన్ని రక్షించుకుందాం.. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం' నినాదంతో గాంధీభవన్ నుంచి ట్యాంక్ బండ్‌పైనున్న అంబేద్కర్ విగ్రహం వరకు శనివారం కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన తిరంగ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే.
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. పశ్చిమ బెంగాల్, అసోం, దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనలపై ప్రధాని ట్వీట్ చేశారు. దేశంలో హింసాత్మక ఘటనలకు తావు ఉండకూడదన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.