కౌలాలంపూర్ : భారతదేశంపై మలేషియా ప్రధాని సంచలన వ్యాఖలు చేశారు.మలేషియా ప్రధాని మహతిర్ మొహమ్మద్ మాట్లాడుతూ భారత్ పై ప్రతీకారం తీర్చుకునేంత శక్తి మలేషియాకు లేదన్నారు. మలేషియా పశ్చిమ కోస్తా ప్రాంతంలోని లాంగ్కావి ద్వీపంలో సోమవారం మీడియాతో ఆయన ఈ వ్యాసఖ్యలు చేశారు. కశ్మీరుపై భారత ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ మలేషియా ప్రధాని చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా ఆ దేశం నుంచి పామాయిల్ దిగుమతులను భారత్ ఈ నెలలో నిలిపివేసింది.
భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేంత పెద్దవాళ్లం కాదని, అంత శక్తి తమకు లేదని, ఈ సమస్యను ఎదుర్కోవడానికి మార్గాలను వెతుక్కోవలసి ఉంటుందన్నారు. జాతీయ గణాంకాల ప్రకారం మలేషియా నుంచి అత్యధికంగా పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నది ఒక్క భారతదేశం మాత్రమే. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..