Dil Raju: దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు.. హైదరాబాద్‌లో 8 చోట్ల అధికారుల తనిఖీలు..

 IT Raids At Dil Raju House:టాలీవుడ్ టాప్ నిర్మాత ఎఫ్డిఎస్ చైర్మన్ దిల్ రాజు ఇంట్లో నేడు ఐ టు సోదాలు నిర్వహిస్తున్నారు హైదరాబాదులోని ఆయన ఇంట్లో ఆయన ఇంటితో పాటు బంధువుల ఇంట్లో కూడా ఈ సోదాలు మొత్తంగా ఎనిమిది చోట్ల చేపడుతున్నారు.

Written by - Renuka Godugu | Last Updated : Jan 21, 2025, 10:16 AM IST
Dil Raju: దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు.. హైదరాబాద్‌లో 8 చోట్ల అధికారుల తనిఖీలు..

 IT Raids At Dil Raju House:  టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు  ఇంట్లో ఐటి సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ  టాలీవుడ్ బడా నిర్మాత ఎఫ్డిఎస్ చైర్మన్ గా కూడా ఉన్నారు. ఇక దిల్ రాజు ఇల్లు ఆఫీసు తో పాటు మొత్తంగా ఆయన సోదరుడు, కుమార్తె, బంధువుల ఇళ్లలోనూ ఈ తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల దిల్ రాజు 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా విడుదలై రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ కూడా సాధించింది. ఇంతలోనే ఇలా ఐటీ రైడ్స్ జరగడం గమనార్హం.

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని దిల్ రాజు ఇళ్లతో పాటు వారి కుటుంబ సభ్యుల ఇళ్లను కూడా ఏకకాలంలో 55 బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. దిల్‌ రాజ్ కూతురు హన్సితా రెడ్డి నివాసంలో కూడా ఐటి అధికారులు తనిఖీలు చేపడుతున్నారు.

ఐటీ రైడ్స్‌ నిర్వహిస్తూ మైత్రి మేకర్స్ కూడా బిగ్ షాక్ ఇచ్చారు అధికారులు. మైత్రి మూవీ సంస్థలలో ఐటి సోదాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఇక మైత్రి నవీన్, సీఈవో చెర్రీ ఇల్లు, ఆఫీసు ప్రాంతాల్లో కూడా ఐటి అధికారులు సోదాలు చేస్తున్నారు. పుష్ప 2 సినిమా నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ భాగస్వామి ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఇక పుష్ప2 సినిమా భారీ కలెక్షన్లు కూడా సంపాదించింది.

 ఇక ప్రధానంగా సంక్రాంతికి రిలీజ్ అయిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా భారీ విజయం సాధించి కోట్ల రూపాయలు వసూలు చేసింది. మరోవైపు గేమ్ చేంజర్ సినిమా కూడా  నిర్మించారు దిల్‌రాజు. ఈ సినిమాలు కోట్లలో ఖర్చు పెట్టి నిర్మాణం చేపట్టారు. ఈ నేపథ్యంలో ఐటి శాఖ ఇలా ఏకకాలంలో రైడ్స్ చేపట్టింది.

 

ఇదీ చదవండి: మరోవారం సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలెర్ట్‌..!  

ఇదీ చదవండి: Neeraj Chopra: నీరజ్‌ చోప్రా వైఫ్‌ హిమాని కూడా గోల్డ్‌ మెడలిస్ట్‌ అని తెలుసా?
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News