Sharon Raj Case: కేరళ షరోన్ రాజ్ హత్య కేసు.. సంచలన తీర్పు వెలువరించిన న్యాయస్థానం..

Kerala court on shron raj case: కేరళలోని తిరువనంతపురం సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువడించింది. షరోన్ ప్రియురాలికి ఉరి శిక్షను ఖరారు చేస్తు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Jan 20, 2025, 01:27 PM IST
  • షాకింగ్ తీర్పు వెలువరించిన కోర్టు..
  • దర్యాప్తుపై కీలక వ్యాఖ్యలు..
Sharon Raj Case: కేరళ షరోన్ రాజ్ హత్య కేసు.. సంచలన తీర్పు వెలువరించిన న్యాయస్థానం..

Kerala court verdict on sharon raj murder case: కేరళలో సంచలనంగా మారిన షరోన్ రాజ్ హత్య కేసులో తిరువనంతపురం సెషన్స్ కోర్టు షాకింగ్ తీర్పు వెలువరించింది. నిందితురాలు గ్రీష్మకు కోర్టు ఉరి శిక్షను ఖరారు చేసింది. దీంతో  ఈ ఘటన వార్తలో  నిలిచింది. కేరళలో 2022 లో ఈ ఘటన పెనుదుమారంగా మారింది. ఒక ప్రియురాలు.. తన ప్రియుడ్ని మాయ మాటలు చెప్పి మరీ మోసానికి పాల్పడింది.

అంతే కాకుండా.. కూల్ డ్రింక్ లో కషాయం కలిపి ఇచ్చి అతను చనిపోయేలా చేసింది. ఈ కషాయం తాగికొన్ని గంటల్లోనే అతను నీలం రంగు వాంతులు చేసుకున్నాడు. ఆ తర్వాత అతని శరీరంలోని అవయావాలన్ని డ్యామేజ్ అయిపోయాయి. ఆతర్వాత గుండెపోటుతో షరోన్ రాజ్ మరణించాడు. ఈ ఘటన దేశంలోనే అప్పట్లో సంచలనంగా మారింది. 

అసలు కేసు ఏంటంటే..?

షరోన్ రాజ్ బీఎస్సీ రేడియాలజీ చేస్తున్నాడు. గ్రీష్మ బీఎస్సీ చదువుకుంటుంది. అనూహ్యంగా వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి అడ్డమైన తిరుగుళ్లు అన్ని తిరిగారు. ఇంట్లోవాళ్లకు తెలీకుండా... పలు చోట్లకు వెళ్లారు. ఈ క్రమంలో గ్రీష్మకు మంచి సంబంధం వచ్చింది. దీంతో షరోజ్ రాజ్ ను దూరం పెట్టింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేది. కానీ షరోన్ రాజ్ మాత్రం.. గ్రీష్మ అంటే పడిచచ్చేవాడు.

అయితే.. గ్రీష్మ జాతంలో.. పెళ్లి దోషం ఉందని.. ఎవరితో పెళ్లి జరిగితే.. అతను చనిపోతాడని తెలీంది. దీంతో గ్రీష్మ తల్లి, మామ ఒక ప్లాన్ వేశారు. షరోజ్ ను పెళ్లి చేసుకుని, అతడ్ని మర్డర్ చేసేందుకు ప్లాన్ చేశారు. దీనిలో భాగంగానే.. గ్రీష్మతన ఇంటికి షరోన్ రాజ్ ను రమ్మని చెప్పింది. ఆమె మాటలు నమ్మి వెళ్లాడు. అక్కడ ఇద్దరికి ఎంగెజ్ మెంట్, అతడితో బొట్టు కూడా పెట్టించాడు. దీంతో ఆ దోషమంతా.. ఇతడికి వెళ్లిపోతుందని వాళ్లు ప్లాన్ చేశారు.

ఆతర్వాత జ్యూస్ లో కషాయం మందు కల్పి తాగేందుకు ఇచ్చారు . అది తాగిబైటకు వచ్చిన కోన్ని గంటలకే షరోన్ రాజ్ నీలిరంగు వాంతులు చేసుకున్నాడు. అతడికి టెస్టులు చేయడగా.. విషయం కల్పిన ఆనవాళ్లు బైటపడ్డాయి. దీంతో పోలీసులు.. గ్రీష్మను, ఆమె తల్లిని, మేనమామను అరెస్ట్ చేశారు.  కొన్నిరోజులకే యువకుడి.. మల్టీపుల్ ఆర్గాన్స్ డ్యామెజ్ అయ్యాయి.. దీంతో అతను గుండెపోటుతో మరణించాడు. అప్పటికే పోలీసులు.. షరోన్ రాజ్ లవర్ ను, ఆమె తల్లి, మేనమామలపై విచారణ ప్రారంభించి కోర్టులో కీలక ఆధారాలు సబ్మిట్ చేశారు. 

 దీనిపై కోర్టు విచారణ జరిపిన కోర్టు పలు వాయిదాల అనంతరం.. మూడేళ్ల తర్వాత.. కేరళలోని తిరువనంతపురంసెషన్స్  కోర్టు యువతి గ్రీష్మకు ఉరి శిక్ష ను ఖరారు చేస్తు తీర్పు వెలువరించింది. యువతి ముఖ్యంగా ప్రియుడ్ని నమ్మించి నయవంచన చేయడంను తీవ్రంగా పరిగణించింది. ఆమె స్వార్థం కోసం.. ఒక నిండు ప్రాణంపోయేందుకు కారణమై.. మరో తల్లికి గర్బశోకం మిగిల్చిందని కోర్టు వ్యాఖ్యలు చేసింది.

Read more:  Kolkata Murder Case: నా కొడుకును అస్సలు వదలొద్దు.. ఆర్జీకర్ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంజయ్ రాయ్ తల్లి..

అంతే కాకుండా.. కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించిందని కోర్టు యువతిపై ఆగ్రహాం వ్యక్తం చేసింది. కనీసం తప్పుచేసిందుకు ఆమెలో ఎక్కడ కూడా ఒక రియలైజేషన్ భావన కన్పించలేదని కోర్టు వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో నిందితురాలు గ్రీష్మకు ఉరి శిక్షను విధిస్తు కేరళ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News