Lions viral video: సాధారణంగా అడవిలో సింహలు, పులులు, ఇతర జంతువులు ఉంటాయి. కొన్నిసార్లు అడవిలోని జంతువులు అడవికి దగ్గరగా ఉన్న గ్రామాల్లోకి వస్తుంటాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు అవి మనుషులపైన దాడులు సైతం చేస్తుంటాయి. ముఖ్యంగా మనుషులు.. ఇటీవల జంతువులు ఉండే ఆవాసాల్లోకి వెళ్లి పోయి అడవి విస్తీర్ణం తగ్గిపోయే విధంగా చేస్తున్నారు. అంతే కాకుండా.. దీని వల్ల అడవిలోని జంతువులు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అడవికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో తరచుగా క్రూర జంతువులు బైటకు వచ్చిన వీడియోలు ఇటీవల ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. ఇటీవల ఒక ఆసియా సింహం అడవి నుంచి హైవే మీదకు వచ్చింది. దీంతో రోడ్డు మీద అరగంటకు పైగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కాసేపు జనాలు ఆ మార్గంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో మరో సింహం వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
The devotion of these lion awakens our emotions, proving that Sanatan Dharma is not just faith but a living truth.
Jai mata di 🦁🐾 pic.twitter.com/n16LadpILv
— Akanksha Parmar (@iAkankshaP) February 21, 2025
దీనిలో రెండు సింహలు అడవిలోకి ఒక అమ్మవారి ఆలయం చుట్టు తిరిగాయి. ఈ ఘటనను దూరంనుంచి సఫారీలో కొంత మంది తమఫోన్ లలో రికార్డు చేశారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. రెండు సింహలు అడవిలో నుంచి బైటకు వచ్చాయి. అవి అమ్మవారి ఆలయం ఉన్న ప్రదేశానికి వచ్చాయి.
మరీ మనుషులకేనా... భక్తి.. మాకు ఉంటుందనుకున్నాయో.. ఏంటోకానీ... ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేశాయి. సింహలు ఆలయంలోకి చూసుకుంటూ ప్రదక్షిణలు చేయడం వీడియోలో స్పష్టంగా రికార్డు అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు. మరికొందరు ఇది నిజంగా అమ్మవారి మహిమే అంటూ భక్తితో పొంగిపోతున్నారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి