YS Sharmila Vs YS Jagan: ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చని చంద్రబాబు ప్రభుత్వం ఇకనైనా నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి డిమాండ్ చేశారు. ప్రవేశపెట్టనున్న ఏపీ బడ్జెట్‌లో సూపర్ సిక్స్ హామీలకు భారీగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇక బడ్జెట్ సమావేశాలకు కూడా తన సోదరుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వెళ్లే దమ్ము లేదని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుంటే రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.
Also Read: VCs Appointments: ఏపీ గవర్నర్ కీలక నిర్ణయం.. 9 విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకం
ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల 'ఎక్స్' వేదికగా విజ్ఞప్తులు చేశారు. 'చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు సూపర్ ఫ్లాప్. పథకాల అమలు ఎప్పుడు అని అడిగితే 9 నెలల్లో 90 కారణాలు చెప్పారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలపై.. సూపర్ సిక్స్ పథకాలపై మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి' కూటమి ప్రభుత్వానికి షర్మిల హితవు పలికారు. ఈనెల 28వ తేదీన ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో సూపర్ సిక్స్ పథకాలకు అత్యధికంగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: Udhayanidhi Stalin: 'మీ అయ్య డబ్బులు అడగడం లేదు' ప్రధాని మోదీపై డిప్యూటీ సీఎం ఆగ్రహం
'అన్ని పథకాలను ఈ ఏడాది నుంచే అమలు చేయండి. ఇచ్చిన మాటను వెంటనే నిలబెట్టుకోండి' అని చంద్రబాబుకు వైఎస్ షర్మిల సూచించారు. ఇక తన సోదరుడు, వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాల్సిన వైఎస్సార్‌సీపీకి అసెంబ్లీకి వెళ్లే దమ్ములేదని విమర్శించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నేరస్తులను, దౌర్జన్యం చేసిన వారిని జైలుకెళ్లి పరామర్శించే సమయం ఉంటుంది కానీ.. ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్లేందుకు మాత్రం మొహం చెల్లదని కౌంటర్ ఇచ్చారు.
'ప్రెస్‌మీట్‌లు నిర్వహించి పురాణం అంతా చెప్పే తీరిక దొరుకుతుంది కానీ అసెంబ్లీలో పాలకపక్షాన్ని నిలదీసే ధైర్యం మాజీ సీఎం వైఎస్ జగన్‌కు లేదు' అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. 'ప్రజలు గెలిపించిన 11 మంది అెంబ్లీకి వెళ్లకుండా మారం చేసే వైఎస్ జగన్‌కు, ఆ ఎమ్మెల్యేలకు ప్రజల మధ్య తిరిగే అర్హత లేదు' అని స్పష్టం చేశారు. ప్రజల సమస్యల మీద మాట్లాడే నైతికత అసలే లేదని పేర్కొన్నాఉ. వైసీపీ ఎమ్మెల్యేలు ఈసారైనా అసెంబ్లీకి వెళ్లాలని షర్మిల డిమాండ్ చేశారు. 'అసెంబ్లీ వేదికగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి. ఈ సారి కూడా అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకుంటే వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామాలు చేయాలి' అని వైఎస్ షర్మిల సవాల్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.