Tirumala Dispute: తిరుమలలో సమసిన వివాదం.. 'థర్డ్‌ క్లాస్‌' వ్యాఖ్యలకు క్షమాపణ

TTD Board Member Naresh Kumar Apology Abused Staff తిరుమలలో తీవ్ర దుమారం రేపిన అసభ్య పదజాలం వాడకంపై ఎట్టకేలకు టీటీడీ సభ్యుడు దిగివచ్చాడు. ఉద్యోగులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణలు కోరాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 21, 2025, 08:22 PM IST
Tirumala Dispute: తిరుమలలో సమసిన వివాదం.. 'థర్డ్‌ క్లాస్‌' వ్యాఖ్యలకు క్షమాపణ

TTD Board Member Apology: తిరుమల ప్రధాన ఆలయం వద్ద టీటీడీ ఉద్యోగిపై అసభ్య పదజాలంతో విరుచుకుపడిన సభ్యుడిపై తీవ్ర వివాదం కొనసాగుతోంది. టీటీడీ బోర్డు సభ్యుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఉద్యోగులు మూడు రోజులుగా ఆందోళన చేపట్టడంతో తిరుమలలో తీవ్ర రచ్చ జరుగుతోంది. ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో అసభ్య వ్యాఖ్యలు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడు ఎట్టకేలకు క్షమాపణలు చెప్పాడు. అతడు క్షమాపణ చెప్పడంతో తిరుమల ఉద్యోగులు ఆందోళన విరమించారు.

Also Read: Boycott OYO: మరో వివాదంలో 'ఓయో రూమ్స్‌'.. ట్రెండింగ్‌లో 'బాయ్‌కాట్‌ ఓయో'

తిరుమల శ్రీవారి ఆలయ మహా ద్వారం వద్ద జరిగిన ఘటనకు రెండు రోజులుగా టీటీడీ ఉద్యోగస్తులు నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. శుక్రవారం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు మౌన ప్రదర్శన చేశారు. ఉద్యోగులు రోజు ఆందోళన చేపడుతుండడంతో టీటీడీ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. సభ్యుడు క్షమాపణలు చెప్పాలని చైర్మన్‌ ఆదేశించారు. దీంతో అసభ్య వ్యాఖ్యలు చేసిన టీటీడీ సభ్యుడు నరేశ్‌కుమార్‌ క్షమాపణలు చెప్పారు.

Also Read: Biryani Bill: బిర్యానీకి డబ్బులు అడిగారని ఇనుప రాడ్డుతో కస్టమర్‌ దాడి.. వీడియో వైరల్‌

ఇకపై అలా చేయను
తిరుమలలో శుక్రవారం టీటీడీ ఉన్నత అధికారులు ఉద్యోగ సంఘం నాయకులతో చర్చలు జరిపారు. బోర్డు సభ్యుడు నరేశ్‌ కుమార్‌ సదరు ఉద్యోగికి క్షమాపణలు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృం కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులు ఆందోళనలు విరమించుకుంటున్నామని  ప్రకటించారు. కర్ణాటకకు చెందిన ఎస్‌ నరేశ్‌ కుమార్‌కు కూటమి ప్రభుత్వం టీటీడీ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.

తిరుమలలో ప్రముఖులు
తిరుమల శ్రీవారిని సంగీత దర్శకుడు ఎస్‌ఎస్‌ థమన్, గాయకులు అద్వితీయ, శృతిరంజని, చంద్రగిరి దర్శించుకున్నారు. ఎమ్మెల్యే నాని, ఏపీ హైకోర్టు న్యాయవాది దుర్గాప్రసాద్ వేరువేరుగా దర్శనం చేసుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. తిరుమలలో కనిపించిన సినీ ప్రముఖులతో భక్తులు ఫొటోలు దిగారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News