Pending Arears: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. త్వరలో పెండింగ్‌ ఏరియర్స్‌ చెల్లింపు

Good To News Govt Employees Very Soon Pending Arears Clears: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త. పెండింగ్‌లో ఉన్న ఏరియర్స్‌ బకాయిలను విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఎప్పుడు విడుదలవుతాయో ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 21, 2025, 10:37 AM IST
Pending Arears: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. త్వరలో పెండింగ్‌ ఏరియర్స్‌ చెల్లింపు

Pending Arears Clears: ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏరియర్స్‌ భారీగా బకాయిలు ఉన్నాయి. వాటిని త్వరలో విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటించారు. సంక్రాంతి పండుగకు లాభాలు రావడంతో ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తామని ప్రకటన చేశారు. ఇంతకీ ఎవరి ఏరియర్స్‌.. ఎప్పుడు విడుదలవుతాయో తెలుసా? దీనివలన ఎవరికి లబ్ధి చేకూరుతుందో తెలుసుకోండి.

Also Read: Retirement Age: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్‌.. పదవీ విరమణ వయస్సు తగ్గించాలని జేఏసీ ఆందోళన

ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) సంక్రాంతి పండుగ సందర్భంగా బస్సు సేవలను ప్రయాణికులకు అందుబాటులో ఉంచింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సమన్వయంతో బస్సు సేవలను అందుబాటులో ఉంచడంతో ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరింది. రికార్డ్ స్థాయిలో ఆదాయాన్ని తెచ్చిపెట్టిందని ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ, డీజీపీ ద్వారక తిరుమల రావు ప్రకటించారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ జనవరి నెలలో ఒక రోజు సంస్థకు వచ్చిన ఆదాయం  మూడుసార్లు రూ.20 కోట్లు దాటిందని వెల్లడించారు.

Also Read: IPS Officers Transfers: పవన్‌ కల్యాణ్‌ దెబ్బ అదుర్స్‌.. కాకినాడ జిల్లా ఎస్పీ బదిలీ

డీజీపీగా.. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ద్వారక తిరుమల రావు సోమవారం రాజమండ్రిలోని ఆర్టీసీ బస్ కాంప్లెక్స్‌ను తనిఖీ చేశారు. బస్టాండ్‌లో ఆర్టీసీ సేవలు.. ఉద్యోగుల పనితీరు.. బస్సు సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా సంక్రాంతి ఆదాయాన్ని ద్వారక తిరుమల రావు వెల్లడించారు. నాలుగేళ్ల మాదిరిగానే ఈ ఏడాది సంక్రాంతికి కూడా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక చార్జీలు వసూలు చేయలేదని వివరించారు. ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ కంటే తమ ఆర్టీసీ బస్సుల వైపు మొగ్గు చూపడంతో గణనీయంగా ఓఆర్ పెరిగిందని వెల్లడించారు.

భారీగా ఆదాయం సమకూరడంతో ఆ ఆదాయాన్ని కార్మికులకు పంచుతామని ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమల రావు ప్రకటించారు.సంక్రాంతి ఆదాయంతో ఆర్టీసీ ఉద్యోగుల ఏరియర్స్ బకాయిలను వారం రోజుల్లో క్లియర్ చేయబోతున్నట్లు శుభవార్త వినిపించారు. త్వరలో 1,200 ఎలక్ట్రికల్ బస్సులు ఏపీఎస్ఆర్టీసీకి రాబోతున్నాయని తెలిపారు. ఆర్టీసీ ఎండీ ప్రకటనతో ఆర్టీసీ ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News