ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన సొరంగ మార్గం అటల్ టన్నెల్ (Atal Tunnel) కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శ్రీకారం చుట్టనున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని రోహ్తాంగ్లో ఉన్న ఈ అటల్ టన్నెల్‌ను శనివారం 10 గంటలకు ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు (Farm Bills) వ్యతిరేకంగా పంజాబ్ రాష్ట్రంలో రైతుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ బిల్లులపై లోక్‌సభ, రాజ్యసభలో ప్రకంపనలు చెలరేగిన విషయం తెలిసిందే.
1 lakh deposit in bank accounts of women ? న్యూఢిల్లీ: మహిళల బ్యాంకు ఖాతాల్లో కేంద్రం రూ. లక్ష రూపాయలు జమ చేసేందుకు సిద్ధమవుతోందని ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పలు వదంతులు వ్యాపిస్తున్నాయి. మహిళ స్వరోజ్‌గార్ యోజన పథకం ( Mahila swarozgar yojana ) కింద మహిళల బ్యాంకు ఖాతాల్లో కేంద్రం రూ. లక్ష రూపాయలు జమ చేస్తోందనేది ఆ వదంతుల సారాంశం.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. నిత్యం రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో వ్యాక్సిన్ (COVID-19 vaccine) కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది భారతీయులకు కేంద్ర ప్రభుత్వం కాస్త ఉమశమనం కలిగించేలా శుభవార్తను వెల్లడించింది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును సీబీఐకి ( CBI ) అప్పగించాల్సిందిగా బీహార్ సర్కార్ చేసిన విజ్ఞప్తిని అంగీకరిస్తున్నట్టు కేంద్రం స్పష్టంచేసింది. ఇదే విషయాన్ని బుధవారం సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం తరపున సుప్రీం కోర్టుకు తెలియజేశారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ని లక్ష్యంగా చేసుకుంటూ పలు విమర్శలు సంధించారు. గాల్వన్ లోయలో భారత్, చైనా మధ్య జరిగిన హింసాత్మక ఘటన నాటినుంచి రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు.
కేంద్ర పన్నుల్లో ( Central taxes ) మే నెల రాష్ట్రాల వాటాలను ( Tax shares of States) కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలకు కలిపి రూ. 46,038.70 కోట్లు విడుదల చేయగా అందులో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ వాటాగా రూ. 982 కోట్లు ( Telangana share ) కేటాయించగా ఆంధ్రప్రదేశ్ వాటా కింద రూ. 1,892.64 కోట్లు ( Andhra Pradesh share ) మంజూరయ్యాయి.
భారత్‌లో కరోనా వైరస్‌ను నియంత్రించే దిశగా సరైన చర్యలు తీసుకుంటున్నారని ప్రశంసిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీకి టెక్నాలజీ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ బుధవారం ఓ లేఖ రాశారు.
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బుధవారం నాడు కొత్తగా 1,486 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 20,471కు చేరుకుంది. గత 24 గంటల్లో 49 మంది కరోనాతో చనిపోయారు. దీంతో ఇప్పటివరకు కరోనావైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 652కి చేరింది.
మే3న ఒకవేళ లాక్డౌన్ ఎత్తేసినా.. ఆ తర్వాత కూడా హోటల్స్, పెద్ద పెద్ద రెస్టారెంట్స్‌పై అక్టోబర్ 15 వరకు లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతాయని ఇటీవల సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. స్వయంగా కేంద్ర పర్యాటక శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసినట్లుగా ఉన్న ఓ సర్కులర్ కూడా ఆ వార్తతో పాటే వైరల్ అవుతోంది. అయితే తాజాగా ఈ పుకార్లపై స్పందించిన పర్యాటక శాఖ.. ఆ వార్తలో నిజం లేదని కొట్టిపారేసింది. ఆ సర్కులర్ తాము విడుదల చేయలేదని కేంద్ర పర్యాటక శాఖ వెల్లడించింది.
భారత్‌లో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 478 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇండియాలో కరోనా వైరస్ సోకడం మొదలైన తర్వాత 24 గంటల్లో ఇంత అత్యధికంగా రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.