జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తు ఉండదని తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి తేల్చిచెప్పారు. అసలు జనసేన పార్టీతో పొత్తు అంశం బీజేపీలో చర్చకే రాలేదని.. అలాగే
పొత్తులపై జనసేన నుంచి కూడా ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని బండి సంజయ్ స్పష్టంచేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయబోయే టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ ప్రకటించింది. టీఆర్ఎస్ తరపున బరిలో నిలవనున్న 105 మంది అభ్యర్థుల పేర్లను ఈ జాబితా ద్వారా వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ 29 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను విడుదల చేసిన కొద్దిసేపట్లోనే టీఆర్ఎస్ పార్టీ ఏకంగా 105 మంది అభ్యర్థులను ప్రకటించడం గమనార్హం.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బుధవారం అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితాను విడుదల చేసింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేసిన ఈ జాబితాలో కాంగ్రెస్ పార్టీ 29 మందికి చోటు కల్పించింది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఆరోపణలు అప్పుడే ప్రారంభమైపోయాయి. ఆ సంతకం తనది కాదని...ఫోర్జరీ చేశారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఏమా సంతకం..కధేంటి..
హైదరాబాద్: హైదరాబాద్లో ఇటీవల భారీ వరదలు పోటెత్తిన కారణంగా నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు ఒక్కో కుటుంబానికి తెలంగాణ సర్కార్ రూ.10 వేల ఆర్థిక సహాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వరద సాయం కోసం నగర వ్యాప్తంగా భారీ సంఖ్యలో ఉన్న వరద బాధితులు మీసేవ కేంద్రాల వద్ద బారులు తీరారు.
గ్రేటర్ ఎన్నికల నగారా మోగింది. నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. అధికారపార్టీ ప్రచార వూహాన్ని ఖరారు చేసింది. సాయంత్రంలోగా తొలి జాబితాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మజ్లిస్ పార్టీతో కలిసి ఎన్నికల ప్రచార వ్యూహాన్ని సిద్దం చేసింది.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీతో బీజేపికి పొత్తు ఉంటుందా అనే ప్రశ్నకు తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టత ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అసదుద్దిన్ ఒవైసి నేతృత్వంలోని ఎంఐఎం పార్టీనే తమ పార్టీకి ప్రధాన ప్రత్యర్ధి అని ఆయన తేల్చిచెప్పారు.
గ్రేటర్ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల నియమావళి అమల్లోకొచ్చింది. ఎన్నికల ఆంక్షల్లో భాగంగా పోస్టర్లు , బ్యానర్ల తొలగింపు చర్యలు ప్రారంభమయ్యాయి. నియమావళి అమలైన కొద్ది గంటల్లోనే 4 వేల పోస్టర్లను తొలగించారు అధికారులు.
దుబ్బాక మగిసింది. దేశంలో ఉప ఎన్నికలు, బీహార్ ఎన్నికలూ ముగిశాయి. ఇప్పుడందరి దృష్టి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపైనే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందంటూ పవన్ కళ్యాణ్ అధికారిక ప్రకటన వెలువరించడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.
Greater Hyderabad Muncipal Elections | గ్రేటర్ లో ఎన్నికల నగారా మోగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలెక్షన్స్ 2020 షెడ్యూల్ ను తెలంగాణ ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఎన్నికలను బ్యాలెట్ బాక్సుల ద్వారా నిర్వహించనున్నారు. నామినేషన్స్ వేయడానికి చివరి తేదీని నవంబర్ 20,2020 గా నిర్ణయించారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దుబ్బాక ఉప ఎన్నికలో ఎదురైన సీన్ ని మరోసారి రిపీట్ కాకుండా ఉండేందుకు టీఆర్ఎస్ పార్టీ నష్టనివారణ చర్యలు చేపట్టింది.
Greater Hyderabad Muncipal Elections | గ్రేటర్ ఎన్నికలపై స్టే విధించాలంటూ వచ్చిన పిటీషన్ పై హైకోర్టు స్పందించింది. ఈ ప్రజావాజ్యాన్ని కాంగ్రెస్ నేత దసోజు శ్రవణ్ కోర్టులో దాఖలు చేయగా కోర్డు విచారణ చేపట్టింది.
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్..ఎంఐఎం పార్టీలిప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై దృష్టి సారించాయి. గ్రేటర్ ఎన్నికల్లో విజయం కోసం కేసీఆర్, ఒవైసీలు భేటీ అయ్యారు. అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
Bandi Sanjay slams CM KCR | తెలంగాణ సీఎం కేసీఆర్కు దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలు దీపావళి గిఫ్ట్ ఇచ్చారని, మరికొన్ని రోజుల్లో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సంక్రాంతి గిఫ్ట్ కూడా ఇస్తారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జీహెచ్ ఎంసి ఎన్నికలపై ( GHMC Elections ) కీలక వ్యాఖ్యాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో మొత్తం 150 సీట్లలో 104 సీట్లను కైవసం చేసుకుంటుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు.
GHMC Elections 2020 | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల నోడల్ అధికారులను జీహెచ్ఎంసీ ఎన్నికల అథారిటీ, కమీషనర్ డీఎస్ లోకేష్ కుమార్ ఇటీవల నియమించారు.
తెలంగాణలోని మొత్తం 11 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకుగానూ 8 పార్టీలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు (GHMC Elections 2020) నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
GHMC Elections కసరత్తు మొదలైంది. ఈ ఎన్నికల నోడల్ అధికారులను నియమించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల అథారిటీ, కమీషనర్ డీఎస్ లోకేష్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.