KTR Calls For Boycott of PM Modi Warangal Tour: ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ పర్యటనను బహిష్కరిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. వరంగల్‌కు ఏ మొహం పెట్టుకుని వస్తున్నారని.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
KTR Calls For Boycott of PM Modi Warangal Tour: ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ పర్యటనను బహిష్కరిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. వరంగల్‌కు ఏ మొహం పెట్టుకుని వస్తున్నారని.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
Revanth Reddy Pressmeet: చేరికలపై ఊహాగానాలు వద్దు.. చాలా అంశాలు చర్చల దశలోనే ఉన్నాయన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నాక.. మేమే అధికారికంగా ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావులతో పాటు ఇంకొంతమంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అని వార్తలొస్తున్న తరుణంలోనే రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనియాంశమయ్యాయి.
Minister KTR Speech: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పురపాలనలో దేశంలోనే అద్భుతమైన ప్రగతి సాధించిన రాష్ట్రం తెలంగాణ అంటే అతిశయోక్తి లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షన్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ కార్యక్రమాలకు ఇచ్చిన అనేక అవార్డులు, ప్రశంసలే ఇందుకు నిదర్శనమన్నారు.
YS Sharmila strong counter to KCR and KTR: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అమర వీరులు చేసిన త్యాగాన్ని కల్వకుంట్ల వారి కుటుంబం తమ భోగంగా మల్చుకుంది అని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఒక పార్టీ కాదని.. అది బందిపోట్ల రాష్ట్ర సమితికి "దోపిడీ మిషన్ " అని ఎద్దేవా చేశారు.
Revanth Reddy About KCR and Dharani Portal Scam: ఈ 75 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు ఇలాంటి దోపిడీకి పాల్పడలేదు అని చెబుతూ.. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును అసెంబ్లీ ప్రాంగణంలో చెట్టుకు ఉరేసి చంపినా తప్పు లేదు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గల్ఫ్ దేశాల్లోలా కేటీఆర్‌ను రాళ్లతో కొట్టి చంపినా తప్పు లేదు అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
Minister KTR Fires On Congress: కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ నేతలను గంగిరెద్దులతో పోల్చారు. ములుగు జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. జాతీయస్థాయిలో ములుగు రెండోస్థానంలో ఉందని గుర్తుచేశారు.
YS Sharmila Slams BJP, BRS: బీఆర్ఎస్ పార్టీ, బీజేపి మధ్య రహస్య స్నేహం ఉందన్న వైఎస్ షర్మిల.. ఈ రెండు పార్టీల తీరు లోకం ముందు నువ్వు కొట్టినట్లు చేస్తే.. నేను ఏడ్చినట్లు చేస్తా.. అన్న చందంగా ఉంది అని ఎద్దేవా చేశారు. అంతటితో ఊరుకోని వైఎస్ షర్మిల.. ఇంతకీ మీరు నడిపే రహస్య దోస్తానం ప్రీ పోల్ ఒప్పందమా ? లేక పోస్ట్ పోల్ ఒప్పందమా ? అని సూటిగానే ప్రశ్నించారు.
ఎల్బీ నగర్ బీఆర్ఎస్లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి కేటీఆర్ కార్యక్రమం అనంతర బాహాబాహీకి దిగాయి. ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి, బీఆర్ఎస్ ఇంఛార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ మధ్య వివాదం మరోసారి బట్టబయలు అయింది. పూర్తి వివరాలు ఇలా..
Bandi Sanjay Writes open letter to Telangana CM KCR: ఇప్పటికే మీ ప్రభుత్వానికి లిక్కర్, లీకేజి, ప్యాకేజీల పేరుతో అవినీతి మరకలు అంటాయి. ఇప్పుడు మీ మౌనం ఓఆర్ఆర్ టెండర్లో భారీ స్కామ్ జరిగిందనే అనుమానాలను బలపరుస్తున్నాయి అని తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. బండి సంజయ్ రాసిన ఈ లేఖలో ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. అవి ఏంటంటే..
karnataka Elections Results 2023 Winners List: ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ కర్ణాటక కాంగ్రెస్‌దేనని కన్నడీగులు డిసైడ్ చేశారు. సర్వేరాయుళ్ల అంచనాలకు మించి కాంగ్రెస్‌కు అత్యధిక సీట్లను అందించారు. కొన్ని సర్వే రిపోర్ట్స్ కాంగ్రెస్‌కు అధిక సీట్లు వచ్చినా... హంగు వచ్చే ఛాన్స్ ఉన్నాయంటూ ఊదరగొట్టాయి.
Basavaraj Bommai resigned to his CM Post : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించగా, భారతీయ జనతా పార్టీ ఓడిపోయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ 136 స్థానాల్లో గెలుపొందగా.. బీజేపి 65 స్థానాలకే పరిమితమైంది.
Bandi Sanjay About Karnataka: కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు సాయంత్రం కరీంనగర్‌లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమి గురించి ప్రస్తావించిన బండి సంజయ్.. బీజేపికి ఉన్న ఓటు బ్యాంకు తగ్గలేదు అని అన్నారు.
Karnataka New Cabinet 2023: కర్ణాటకకు కాబోయే కొత్త ముఖ్యమంత్రి ఎవరు ? కర్ణాటక కొత్త కేబినెట్ ఎలా ఉండబోతోంది అనేదే ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. కర్ణాటక కొత్త కేబినెట్ విషయంలో పార్టీ హైకమాండ్ ఇప్పటికే ముగ్గురు డిప్యూటీ సీఎంల పేర్లను కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
KTR, Harish Rao About Karnataka Election Result 2023: కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు తెలంగాణలో త్వరలోనే జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి అనే ఆసక్తి నెలకొని ఉంది. ముఖ్యంగా కర్ణాటక ఫలితాలపై తెలంగాణ అధికార పార్టీ నేతలు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు.
వరంగల్‌లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.