'కరోనా వైరస్' కారణంగా విధించిన లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 3 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు సామూహికంగా యుద్ధం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పకడ్బందీగా లాక్ డౌన్ అమలవుతోంది.
కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి తెలంగాణలో ఏరోజుకు ఆరోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ వస్తున్నప్పటికీ.. చాలా రోజుల తర్వాత శనివారం మాత్రం కొత్తగా వెలుగుచూసిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌కే పరిమితమవడం విశేషం.
లాక్ డౌన్ నేపథ్యంలో సాధారణ దుకాణాలు, అన్ని వ్యాపారాలతో పాటే బార్ అండ్ రెస్టారెంట్స్, మద్యం దుకాణాలు కూడా మూత పడిన నేపథ్యంలో లాక్ డౌన్ ఎప్పుడెప్పుడు ఎత్తేస్తారా ? ఎప్పుడెప్పుడు మళ్లీ గొంతు తడిచేసుకోవచ్చా అన్న చందంగా మద్యం ప్రియులు ఎదురుచూశారు.
భారత్‌లో గత 24 గంటల్లో 1,490 మందికి కరోనా వైరస్ సోకినట్టుగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో కరోనా కారణంగా 56 మంది మృతి చెందినట్టు కేంద్రం వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 24,942కి చేరగా.. మృతుల సంఖ్య 779కి చేరింది.
లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఆలోచనలో పడిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్.. లాక్ డౌన్ తర్వాత మెట్రో రైలు ఎక్కే ప్రయాణికులు ఫేస్ మాస్క్ ధరించడంతో పాటు, వారి మొబైల్లో ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా ఉండాలనే నిబంధన విధించేందుకు సిద్ధమైంది.
'కరోనా వైరస్'.. మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. అన్ని ప్రాంతాల్లో వ్యాపిస్తూ.. భయాందోళన సృష్టిస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. మరోవైపు లక్షణాలు లేకుండా వస్తున్న కరోనా మహమ్మారి కారణంగా పలు రాష్ట్రాల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఆయా రాష్ట్రాలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కుంటున్నాయి.
'కరోనా వైరస్'.. కరాళ నృత్యం చేస్తున్న వేళ దేశవ్యాప్తంగా పకడ్బందీగా లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 3 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జనం అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి కొత్త భయం పట్టుకుంది.
చిలకలగూడలో నారాయణ అనే ఓ 22 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది. ఇరుగుపొరుగు వారు అందించిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న చిలకలగూడ పోలీసులు.. ఘటన స్థలాన్ని పరిశీలించారు.
'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 3 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. కరోనా వైరస్ లొంగిరాకపోవడంతో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఉత్తర ప్రదేశ్ సర్కారు మరో కఠిన నిర్ణయం తీసుకుంది.
'కరోనా వైరస్' కారణంగా విధించిన లాక్ డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ లాక్ డౌన్ కొనసాగుతోంది. ఐతే ప్రస్తుతం రంజాన్ నేపథ్యంలో... ముస్లింల కోసం ప్రత్యేక సడలింపులు ఇస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
'కరోనా వైరస్'.. భారత దేశంలోనూ మృత్యుకేళీ ఆడుతోంది. ఇప్పటి వరకు లేని కొత్త రికార్డులను సృష్టిస్తోంది. 24 గంటల్లోనే మరణాల సంఖ్య 57కు చేరడం గుబులు రేకెత్తిస్తోంది.
'కరోనా వైరస్'.. భారత దేశంలో వేగంగా విస్తరిస్తోంది. కాబట్టి లాక్ డౌన్ విధించారు. మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతున్న వేళ.. పరిమిత ఆంక్షలతో ఏప్రిల్ 15న లాక్ డౌన్ మార్గదర్శకాల జాబితాను విడుదల చేసింది కేంద్రం.
కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 37 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. అదే సమయంలో కొత్తగా మరో 1,752 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో శుక్రవారం రాత్రి నాటికి దేశంలో మొత్తం కొవిడ్ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 23,452 చేరుకుంది.
కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చూసేందుకు తాను చేయాల్సిందంతా చేస్తున్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. గత కొన్ని రోజులుగా వాగులు, వంకలు దాటుకుంటూ రోడ్డు మార్గం కూడా సరిగ్గా లేని గ్రామాల్లోకి వెళ్తున్న ఆమె.. అక్కడి ప్రజలకు నిత్యవసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేస్తున్నారు.
ఏపీలో గత 24 గంటల్లో 6306 బ్లడ్ శాంపిల్స్‌కి కోవిడ్ పరీక్షలు జరపగా అందులో 62 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్దారణ అయిందని ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి తెలిపారు.
కరోనా మహమ్మారి విజృంభణ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మానవాళి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. అయితే ఈ కష్ట కాలంలో ఒక విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది.
రైతుల శ్రేయస్సు కోరి 30 వేల కోట్ల రూపాయలు వెచ్చించి 100% ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకోగా మిల్లర్లు మాత్రం తరుగు పేరుతో ఇష్టమొచ్చినట్టు తూకంలో మోసం చేయడం ఎంత మాత్రం క్షంతవ్యం కాదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు 300 అన్నపూర్ణ సెంటర్ల ద్వారా దాదాపు 2 లక్షల మందికి ప్రతీ రోజు ఉదయం సాయంత్రం భోజనాన్ని అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.
'కరోనా వైరస్'.. పుట్టిల్లు చైనా. వుహాన్ లో 2019 డిసెంబర్ లో ఈ వైరస్ పుట్టుకొచ్చింది. అక్కడి నుంచి ప్రపంచ దేశాలకు అనతి కాలంలోనే వ్యాపించింది. ఇప్పుడు 200 దేశాలకు పైగా దేశాలను ఈ మహమ్మారి భయపెడుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.