త్రిపుర ఎన్నికల ఫలితాల్లో భాజపా కూటమి హవా కొనాసాగుతోంది. 59 స్థానాలకుగాను ఎన్నికలు జరగ్గా.. 32 స్థానాల్లో కమలం పార్టీ ముందంజలో ఉంది. అధికార లెఫ్ట్ పార్టీలు 27 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవకపోవడమనేది గమనార్హం. బీజేపీ హవా ఇలాగే కొసాగితే ఆ పార్టీ సరికొత్త రికార్డు సృష్టించినట్లే. ఎందుకంటే అక్కడ పాతికేళ్లుగా వామపక్ష కూటమి అధికారంలో ఉంది. భాజపా కూటమి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నందున అక్కడ వామపక్ష కూటమి గద్దెదిగడం ఖాయంగా కనిపిస్తోంది. తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు అవకాశాలు కనిపిస్తుండటంతో బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
దేశ వ్యాప్తంగా ప్రతీ చోట బీజేపీ ప్రభావం కనిపిస్తుంది..కానీ ఈశాన్య రాష్ట్రాల విషయంలో పరిస్థితి భిన్నం. అక్కడ బీజేపీకి ఎప్పుడూ ఎదురుగాలే. అయితే అదంతా చరిత్ర...మోడీ చరిష్మాతో అక్కడ కూడా పాజిటివ్ ఫలితాలు వస్తాయంటున్నారు కమలనాథులు. అదే జరిగితే చరిత్రను తిరగరాసినట్టే. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ వరుస విజయాలతో దూసుకువెళ్తున్న విషయం తెలిసిందే. ఈశాన్య రాష్ట్రాల్లోనూ విజయందుందుభి మోగిస్తే మోడీ సర్కార్‌కు తిరుగుండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిణమాలు బట్టి చూస్తే ఒక్క నాగాలాండ్‌లో మాత్రమే బీజేపీ పూర్తి ఆధిక్యాన్ని కనబరుస్తోంది.
ఈనాన్య రాష్ట్రాల్లో పాగా వేయలనుకుంటున్న బీజేపీకి నాగాలాండ్ లో ఆశాజనకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కడపటి వర్తాలు అందేసరికి మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకుగాను 17 స్థానాల్లో ఫలితాలు వెలువడగా బీజేపీ 13 స్థానాల్లో గెలుపొందింది. స్థానిక ఎన్పీఎఫ్ పార్టీ మిగిలిన 4 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ ,ఎన్సీపీ ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.