Telangana Rains : విపరీతమైన ఎండ, ఉక్కపోతలతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాబోయే నాలుగు రోజుల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Telangana Formation Day : తెలంగాణలో కుటుంబ పాలనతో ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దొరికి అన్ని చోట్లా అప్పులు తెస్తున్నారని, తెలంగాణ తెచ్చుకున్నది అప్పుల కోసమా? అని నిలదీశారు. నిధులు రాక సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నాడు.
Harish Rao : రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రభుత్వం డబ్బులు చెల్లించిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రైతు బంధు ఇస్తున్నామని తెలిపాడు. ఇప్పుడు రైతుల అదాయం పదింతలు పెరిగిందని అన్నాడు. రైతులు చనిపోతే భీమా సైతం ఇస్తుందని అన్నాడు.
Telangana Farmationday : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుతామని కేంద్రం ప్రకటించడంతో బీఆర్ఎస్ ఇరకాటంలో పడినట్టు అయింది. వేడుకలు నిర్వహిస్తున్న విషయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. గోల్కొండ కోటలో ఘనంగా ఈ వేడుకలు జరుపబోతోన్నట్టుగా తెలిపారు
Ex Minister Vivek : పార్టీ మారుతున్నట్టుగా వస్తోన్న రూమర్లను ఖండించాడు మాజీ ఎంపీ, బీజేపీ జాతియ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ నియంత పాలనను ముగింపు పలకడానికి, ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాటం ఆగదని వివేక్ అన్నారు.
Asaduddin Owisi : హైద్రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి కేసీఆర్తో గ్యాప్ వచ్చిందా?బీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం షాక్ ఇవ్వబోతోందా? తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు మాత్రం అవుననే సమాధానం ఇస్తున్నాయి. ఆదిలాబాద్ సభలో కేసీఆర్ను ఓవైసీ టార్గెట్ చేశాడు.
Minister Mallareddy : కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి మల్లారెడ్డి మండిపడ్డాడు. ఆ రెండు పార్టీలు తెలంగాణకు చేసిందేమీ లేదని, ఏ మొహం పెట్టుకుని అడుగుతారని కౌంటర్లు వేశారు. ఆ పార్టీలను ప్రజలు తిరస్కరిస్తారని జోస్యం చెప్పాడు మంత్రి మల్లారెడ్డి.
Telangana Congress : కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉదయం సమావేశం కానున్నారు. ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్యరావ్ ఠాకూర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్ నేతలు ఈ సమావేశంలో భేటీ కానున్నారు. జూన్ 2వ తేదీ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల మీద చర్చించనున్నారు.
Telangana : రాష్ట్ర ప్రగతి, అమరుల త్యాగాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై సీఎం ప్రత్యేకంగా సమీక్షను చేపట్టాడు.
Revanth Reddy : సీఎం కేసీఆర్ తన చర్మాన్ని వలిచి చెప్పులు కుట్టించినా కూడా పాలమూరు ప్రజల రుణాన్ని తీర్చుకోలేరని రేవంత్ రెడ్డి అన్నారు. కరీంనగర్లో అయితే ప్రజలు ఓడిస్తారని పాలమూరులో ఆదరించారని, అలాంటి వారిని కూడా సీఎం కేసీఆర్ మోసం చేశారని తన పాదయాత్రలో రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.
Telangana Weather Updates: సోమవారం తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. అనేక చోట్ల మార్కెట్ యార్డుల్లో, ఐకేపీ కేంద్రాల్లో రైతులు కొనుగోలు కోసం తీసుకొచ్చిన ఒడ్లు వర్షాల పాలయ్యాయి. వర్షపు నీటికి వరి ధాన్యం తడిసిపోవడం చూసి అన్నదాతల అవస్థలు అంతా ఇంతా కాదు.
MP Soyam Bapu : పెళ్లి వేడుకల్లో సోయం బాపు చిందులు వేశారు. తన కొడుకు పెళ్లి వేడుకల్లో సోయంబాపురావు సందడి చేశారు. వివాహా అనంతరం ఆదివాసి సంప్రదాయ పాటలకు డ్యాన్సులు వేశారు. బంధుమిత్రులతో ఉత్సాహంగా కనిపించారు.
Telangana Rains : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. జగిత్యాల, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ ఈదురు గాలులతో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాకపోకలు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
Telangana Rains : తెలంగాణలో విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు ఎండలు మండిపోతుంటే.. మరో వైపు వర్షాలు దంచికొడుతున్నాయి. రానున్న మూడురోజుల్లో తేలిక పాటి వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో వైపు ఏపీలో వడగాలులు కొనసాగుతున్నాయి.
CM KCR : ఇవాళ, రేపు సీఎం కేసీఆర్ వరుస సమావేశాలతో హీట్ పెంచబోతోన్నారు. మధ్యాహ్నం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాలు జరగన్నాయి. కొత్త సచివాలయంలో మొదటి సారిగా భేటీ జరగనుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఉంటాయా? అనే దానిపై చర్చించుకోనున్నారు.
Khammam : ఖమ్మం నగరంలో చిన్నారుల కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. చెరువు బజార్ ఏరియాలో బుర్ఖా వేసుకున్న వ్యక్తి ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకుపోయే ప్రయత్నం చేశాడు. పెద్దలు అక్కడే ఉండటంతో మెల్లిగా జారుకునే ప్రయత్నం చేశాడు.
Summer Temparature : భానుడి భగభగలతో రెండు తెలుగు రాష్ట్రాలు మండిపోతోన్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఉష్ణోగ్రతలు ఠారెత్తిపోతోన్నాయి. మూడు రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గరిష్టంగా 45 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.