Pixel Smartwatch: ఇండియాలో గూగుల్ తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ గూగుల్ పిక్సెల్ 7 , పిక్సెల్ 7 ప్రో లాంచ్‌తో పాటు తొలిసారిగా పిక్సెల్ స్మార్ట్‌వాచ్ లాంచ్ చేసింది. యాపిల్ స్మార్ట్‌వాచ్‌కు దీటుగా ఈ స్మార్ట్‌వాచ్ లాంచ్ చేయడంతో అందరిలో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్ ధర ఎంత, ఫీచర్లు ఎలా ఉన్నాయి, యాపిల్ వాచ్‌కు పోటీ ఉంటుందా లేదా అనేది చూద్దాం.
మేడ్ బై గూగుల్ హార్డ్‌వేర్ ఈవెంట్లో గూగుల్ తొలి స్మార్ట్‌వాచ్ ఆవిష్కృతమైంది. రౌండ్ డయల్ కలిగిన తొలి స్మార్ట్‌వాచ్‌ను పిక్సెల్ వాచ్‌గా ప్రవేశపెట్టింది. పిక్సెల్ వాచ్ గూగుల్ వేర్ ఓఎస్‌తో పనిచేస్తుంది. పిక్సెల్ స్మార్ట్‌వాచ్, యాపిల్ స్మార్ట్‌వాచ్‌కు పోటీగా ఉంటుందని తెలుస్తోంది. యాపిల్ స్మార్ట్‌వాచ్ కేవలం ఐఫోన్లతోనే పని చేస్తుంది. అదే గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌వాచ్ ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లతో పనిచేస్తుంది.
గూగుల్ కొత్త పిక్సెల్ స్మార్ట్‌వాచ్ డయల్ 80 శాతం రీసైకిల్ స్టెయిన్లెస్ స్టీల్‌తో నిర్మితమైంది. ఈ స్మార్ట్‌వాచ్ డయల్ మూడు రంగుల్లో అంటే బ్లాక్, సిల్వర్, గోల్డ్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది.
గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌వాచ్ ధర
బ్లూటూత్ వేరియంట్ పిక్సెల్ స్మార్ట్‌వాచ్ ధర 28,600 ఉంది. అదే ఎల్టీఈ వేరియంట్ ధర 32,700 రూపాయలుగా ఉంది. అక్టోబర్ 6 నుంచి ప్రీ ఆర్డర్ బుకింగ్ అందుబాటులో ఉంది.
అదే సమయంలో యాపిల్ స్మార్ట్‌వాచ్ సిరీస్ 8 ధర 45,900 ఉంది. శాంసంగ్ స్మార్ట్‌వాచ్ 5 ధర 27,999 రూపాయలుంది.
గూగుల్ పిక్సెల్ వాచ్ ఫీచర్లు
గూగుల్ పిక్సెల్ వాచ్‌లో టచ్ సపోర్ట్‌తో పాటు రౌండ్ 3డి గ్లాస్ డయల్ ఉంటుంది. వేర్ ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో ఫిట్‌బిట్ ఫీచర్ కూడా ఉంది. పిక్సెల్ వాచ్ ట్రాకర్, స్మార్ట్‌వాచ్ రెండూ ఆన్ డివైస్ ఎంఎల్ సామర్ధ్యం కలిగి ఉన్నాయి. కస్టమర్లకు వాచ్‌తో పాటు ఉచితంగా 6 నెలల ఫిట్‌బిట్ ప్రీమియం సభ్యత్వం లభిస్తుంది.
Also read: Xiaomi Assets Seizure Case: షావోమి ఇండియా భారత్ నుండి పాకిస్థాన్‌కి వెళ్లిపోతోందా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook