Google Pixel 7 Launch: పిక్సెల్ 7 సిరీస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసిన గూగుల్, ఫీచర్లు చూస్తే మతి పోవల్సిందే

Google Pixel 7 Launch: ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ అభివృద్ధి చేసిన పిక్సెల్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ కోసం నిరీక్షణ ముగిసింది. అద్భుత ఫీచర్లతో రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. ఆ వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 6, 2022, 11:21 PM IST
Google Pixel 7 Launch: పిక్సెల్ 7 సిరీస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసిన గూగుల్, ఫీచర్లు చూస్తే మతి పోవల్సిందే

Google Pixel 7 Launch: గూగుల్ కంపెనీ పిక్సెల్ 7 సిరీస్ స్మార్ట్‌‌ఫోన్ లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో గూగుల్ రెండు మోడల్స్ ప్రవేశపెట్టింది. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ రెండు వేరియంట్ల కోసం మార్కెట్‌లో చాలాకాలంగా నిరీక్షణ కొనసాగింది. ఈ రెండు వేరియంట్ల ధర ఎంత, ఫీచర్లు ఏమిటనే వివరాలు తెలుసుకుందాం..

గూగుల్ పిక్సెల్ 7 , గూగుల్ పిక్సెల్ 7 ప్రో రెండు వేరియంట్లను గూగుల్ లాంచ్ చేసింది. పిక్సెల్ 7లో 6.3 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతోపాటు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఇక ప్రో వేరియంట్‌లో 6.7 ఇంచెస్ క్యూహెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతో పాటు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. 

పిక్సెల్ 7ను గూగుల్ కంపెనీ 3 రంగుల్లో లాంచ్ చేసింది. ఇందులో స్నో, లెమన్ గ్రాస్, ఆబ్సీడియన్ ఉన్నాయి. దీంతోపాటు గూగుల్ కంపెనీ పిక్సెల్ వాచ్, పిక్సెల్ బడ్స్, పిక్సెల్ ట్యాబ్‌లెట్ కూడా లాంచ్ చేసింది. గూగుల్ ఇప్పుడు లాంచ్ చేసిన రెండు ఫోన్లను మోస్ట్ పవర్‌ఫుల్, సెక్యూర్డ్ ఫోన్లుగా అభివర్ణించింది. ఈ స్మార్ట్‌ఫోన్లు అత్యాధునిక పిక్సెల్ కెమేరాతో ఉన్నాయి. ఇవి ఆండ్రాయిడ్ 13తో పనిచేస్తాయి.

ధర ఎంత

గూగుల్ పిక్సెల్ 7 ప్రో ఇండియాలో 84,999 రూపాయలుగా ఉంది. ఇక పిక్సెల్ 7  ప్రారంభ ధర 59,999 రూపాయలుంది. పిక్సెల్ 7 ప్రో అనేది వీపీఎన్‌తో పనిచేసే ఏకైక స్మార్ట్‌ఫోన్ అని గూగుల్ తెలిపింది. ఈ రెండు ఫోన్లలో గూగుల్ ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్ ఇస్తోంది. ఈ రెండు ఫోన్లు 2 సెక్యూర్డ్ చిప్స్‌తో వస్తున్నాయి. ఒకటి టైటాన్ ఎం2 సెక్యూరిటీ చిప్ కాగా రెండవది గూగుల్ టెన్సార్ జి2 చిప్. 

Also read: Vodafone idea plans: వోడాఫోన్ ఐడియా అద్భుత ఆఫర్, 75 జీబీ డేటా అదనం, ఇవాళ ఆఖరు తేదీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News