HMD New Skyline Smartphone: కొత్త నోకియా కంపెనీ HMD మార్కెట్‌లో దూసుకుపోతోంది. ఎప్పటికప్పుడు ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ చేస్తూ మార్కెట్‌లో తనదైన శైలిలో మార్క్ సంపాదించుకుంది. అంతేకాకుండా ఇటీవలే 'ఆకాశాన్ని తాకడం అంటే ఏమిటి' అనే ట్యాగ్‌లైన్‌తో ప్రత్యేకమైన టీజర్స్‌ను కూడా ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా మార్కెట్‌లోకి HMD స్కైలైన్‌ను మొబైల్ లాంచ్ అయ్యింది. ఇది ఇటీవలే జూలై నెలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. దీనిని దృష్టిలో పెట్టుకుని మరో కొత్త మొబైల్ విడుదల కాబోతోంది. ఇది కూడా Skyline పేరుతో అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 108 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఇవే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ అనేక రకాల శక్తివంతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
HMD స్కైలైన్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్:
ఈ HMD స్కైలైన్ స్మార్ట్‌ఫోన్ 6.55 అంగుళాల P-OLED ఫుల్ HD+ డిస్‌ప్లే సెటప్‌లను కలిగి ఉంటాయి. అంతేకాకుండా దీని డిస్ల్పే 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌లను కలిగి ఉంటుంది. కంపెనీ ఈ మొబైల్ డిప్ల్పే ప్రొటక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ 3 సెటప్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఈ మొబైల్ 8 GB ర్యామ్ + 128 GB ఇంటర్నల్ స్టోరేజ్, 12 GB ర్యామ్ + 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్‌తో అందుబాటులోకి రానుంది. ఇవే కాకుండా కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎంతో శక్తివంతమైన Snapdragon 7s Gen 2 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది LED ఫ్లాష్‌తో కూడిన త్రిపుల్ కెమెరా సెటప్‌ను కూడా అందిస్తోంది.
ఈ HMD స్కైలైన్ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సెటప్ ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది. ఇది 108-మెగాపిక్సెల్ OIS ప్రధాన కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇది 50-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా శక్తివంతమైన 4600mAh బ్యాటరీతో కలిగి ఉంటుంది. ఇది 33 వాట్ల వైర్డు ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. అలాగే సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు బయోమెట్రిక్ సెటప్‌ను కలిగి ఉంటుంది.
Also Read: Virat Kohli: భారత్‌కు దూరంగా కోహ్లీ, అనుష్క.. బ్రిటన్‌లో సెటిల్ అయ్యేందుకు ప్లాన్..!
ఈ మొబైల్ IP54 డస్ట్, వాటర్ రెసిస్టెంట్ సెటప్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది Android 14 సెటప్‌పై పని చేస్తుంది. అలాగే ఇందులో రెండు ప్రధాన OS అప్‌గ్రేడ్‌లతో అందుబాటులోకి రానుంది. దీని ధర వివరాల్లోకి మొదటి వేరియంట్ దాదాపు రూ. 41,950 నుంచి ప్రారంభం కాబోతోంది. అంతేకాకుండా ఇది మూడు స్టోరేజ్ ఆప్షన్స్‌లో రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Virat Kohli: భారత్‌కు దూరంగా కోహ్లీ, అనుష్క.. బ్రిటన్‌లో సెటిల్ అయ్యేందుకు ప్లాన్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.