YS Vijayamma: కారు ప్రమాదం వార్తలపై వైఎస్‌ విజయమ్మ కలత.. నన్ను అడ్డం పెట్టుకుని నీచ నికృష్టం

YS Vijayamma Car Accident: కారు ప్రమాదంతో తన హత్యకు కుట్ర చేశారని వస్తున్న వార్తలను వైఎస్‌ విజయమ్మ ఖండించారు. తన కుమారుడు పేరు పెట్టి దుష్ప్రచారం చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. ఇది జుగుప్సకరమని పేర్కొన్నారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 4, 2024, 04:51 PM IST
YS Vijayamma: కారు ప్రమాదం వార్తలపై వైఎస్‌ విజయమ్మ కలత.. నన్ను అడ్డం పెట్టుకుని నీచ నికృష్టం

రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం నన్ను తీవ్రంగా కలచి వేస్తోంది. కొంతమంది సోషల్ మీడియాలో లేనిపోని అసత్య కథనాలు ప్రచారం చేయడం చూస్తుంటే నాకు తీవ్ర మానసిక వేదన కలుగుతోంది. నన్ను అడ్డం పెట్టుకుని చేస్తున్న నీచ, నికృష్ట రాజకీయాలకు ఖండించకపోతే ప్రజలు నిజం అని నమ్మే ప్రమాదం ఉంది. వాస్తవాలను, కొంత మంది దుర్మార్గపు ఉద్దేశాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే నేను ఈ వివరణ రాస్తున్నాను. రెండు రోజుల కిందట నా కారుకు ప్రమాదం జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు.

Also Read: YS Vijayamma: విజయమ్మ హత్యకు వైఎస్‌ జగన్‌ కుట్ర? మరో బాంబు పేల్చిన తెలుగుదేశం పార్టీ

గతంలో ఎప్పుడో జరిగిన నా కారు ప్రమాదాన్ని...నా కుమారుడి పై పెట్టి దుష్ప్రచారం చెయ్యడం అత్యంత జుగుప్సాకరం. రాజకీయంగా లబ్ది పొందాలనే ఈ ప్రయత్నం అత్యంత దర్మార్గం. అమెరికాలో ఉన్న నా మనవడి దగ్గరకు వెళితే దాన్ని కూడా తప్పుగా చిత్రీకరించి... భయపడి నేను విదేశాలకు వెళ్ళిపోయినట్లు దుష్ప్రచారం చెయ్యడం అత్యంత నీతిమాలిన చర్య. రాజకీయ ప్రయోజనాల కోసం ఇంతగా దిగజారి ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇలా దుష్ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించాలనే విధానం ఏమాత్రం సమర్ధనీయం కాదు. ఈ నీచ సంస్కృతిని ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. ఇకముందు ఇటువంటి దుష్ప్రచారాలను, వ్యక్తిత్వహనన వైఖరిని ఆపితే మంచిది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈ వికృత చేష్టలను గమనిస్తూనే ఉన్నారు. సరైన సమయంలో సరైన విధంగా బుద్ధి చెబుతారు. ఇక పై ఇటువంటి లేనిపోని అసత్యలను ప్రచారం చేస్తే నేను చూస్తూ ఊరుకోదలచుకోలేదు.

Also Read: Pawan Kalyan: వైఎస్‌ జగన్‌ నుంచి షర్మిలకు రక్షణ కల్పిస్తాం: పవన్ కల్యాణ్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

 

Trending News