Lava Blaze X: 64MP AI సోనీ కెమేరాతో Lava Blaze X లాంచ్, ధర, ఇతర ఫీచర్లు ఇలా

Lava Blaze X: ప్రముఖ ఇండియన్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ లావా నుంచి కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Lava Blaze X పేరుతో వస్తున్న ఈ ఫోన్ 64 మెగాపిక్సెల్ కెమేరాతో మార్కెట్‌లో ప్రత్యేక ఆకర్షణ కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 10, 2024, 03:44 PM IST
Lava Blaze X: 64MP AI సోనీ కెమేరాతో Lava Blaze X లాంచ్, ధర, ఇతర ఫీచర్లు ఇలా

Lava Blaze X: భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో లావాకు ప్రత్యేక స్థానముంది. అద్భుత ఫీచర్లు కలిగి ఉండి తక్కువ ధరకు అందుబాటులో ఉండటంతో సామాన్యుడి స్మార్ట్‌ఫోన్‌గా ప్రసిద్ధికెక్కింది. ఇప్పుడు త్వరలో మరో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Lava Blaze X పేరుతో ఈ ఫోన్ మార్కెట్‌లో ఆవిష్కరించనుంది. 

Lava Blaze X ఫోన్ 6.67 ఇంచెస్ కర్వ్డ్ ఎమోల్డ్ డిస్‌ప్లే, ఫుల్ హెచ్‌డి రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. డిస్‌ప్లేలో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. Lava లాంచ్ చేయనున్న Lava Blaze X ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ప్రోసెసర్‌తో ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 15 సహా రెండేళ్ల వరకూ సెక్యూరిటీ అప్‌డేట్స్ ఉచితంగా లభిస్తాయి. ఈ ఫోన్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. 

ఈ ఫోన్ స్టార్‌లైట్ పర్పుల్, టైటానియం గ్రే రంగుల్లో అందుబాటులో ఉండనుంది. ఇందులో 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉంటాయి. ఇక కెమేరా విషయం పరిశీలిస్తే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా ఉంటుంది. ఇది కాకుండా 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమేరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ లేదా వీడియో కెమేరా ఉన్నాయి. 

Lava Blaze Xలో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ అయితే 14,999 రూపాయలుంటుంది. అదే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అయితే 16,999 రూపాయలుంటుంది. ఈ ఫోన్ మార్కెట్‌లో లాంచ్ తేదీ వచ్చేసింది. జూలై 20 మధ్యాహ్నం 12 గంటల్నించి అమెజాన్ ఈ కామర్స్ వేదికలో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. 

Also read: Hybdrid Car vs Electric Car: హైబ్రిడ్ వర్సెస్ ఎలక్ట్రిక్ కార్లలో ఏది మంచిదో ఎలా తెలుసుకోవడం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News