Infinix Zero 20 Price Down Suddenly: అతి తక్కువ ధరలోనే ప్రీమియం సెల్ఫీ కెమెరా కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో భాగంగా కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన మొబైల్స్ అతి తక్కువ ధరలో లభిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలే మార్కెట్‌లో విడుదలైన ఇన్ఫినిక్స్ జీరో 20 (Infinix Zero 20) స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ వివిధ స్టోరేజ్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా వివిధ రకాల కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం మార్కెట్‌లో 8 GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ Infinix Zero 20 స్మార్ట్‌ఫోన్ ధర MRP రూ.24,999తో అందుబాటులో ఉంది. అయితే బచత్ ధమాల్ సేల్‌లో భాగంగా ఈ మొబైల్‌పై దాదాపు 28 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ప్రత్యేకమైన డిస్కౌంట్ పోను రూ. 17,999కే లభిస్తుంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకమైన ఈ సేల్‌లో భాగంగా ఫ్లిఫ్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో పేమెంచ్ చేస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఇతర బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
అలాగే ఈ Infinix Zero 20 మొబైల్‌పై ఎక్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే ప్రత్యేకమైన అదనపు భోనస్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్‌ను వినియోగించాలనుకునేవారు పాత మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌కు ఎక్చేంజ్ రూపంలో అందివ్వాల్సి ఉంటుంది. ఇలా ఎక్చేంజ్ చేసేవారికి రూ.17,400 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్ పోను ఈ మొబైల్ కేవలం రూ.599కే పొందవచ్చు. అయితే ఈ ధర అనేది ఎక్చేంజ్ చేసే మొబైల్‌పై ఆధారపడి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ కండీషన్ బాగుంటేనే తగ్గింపు లభిస్తుంది.
Infinix Zero 20 ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
6.7 అంగుళాల డిస్‌ప్లే
ఫుల్ HD + రిజల్యూషన్ సపోర్ట్
90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్
Mali G57 GPUతో MediaTek Helio G99 చిప్‌సెట్
108-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్ కెమెరా
13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా
2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా
60 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
4500mAh బ్యాటరీ సపోర్ట్
45-వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
టైప్-సి పోర్ట్
ఆండ్రాయిడ్ 12 ఆధారత XOS 12
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి