Jio Recharge Plans: జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్.. అందుబాటులో సూపర్ ప్లాన్స్

కస్టమర్లకు జియో గుడ్‌న్యూస్ అందించింది. ఇప్పటికే అనేక ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోన్న జియో.. తన కస్టమర్ల కోసం ఓ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ప్రతి నెలా రీఛార్జ్‌ చేయకుండా ఒకేసారి మూడు నెలలకు రీఛార్జ్ చేసుకుంటే.. కొన్ని బెనిఫిట్స్ కూడా అందించనుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 21, 2022, 05:26 PM IST
  • జియో వినియోగదారులకు రీఛార్జ్ ఆఫర్స్
  • రీఛార్జ్‌తో పాటు స్పెషల్ బెనిఫిట్స్
  • ఆఫర్స్ చెక్ చేసుకోండి
Jio Recharge Plans: జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్.. అందుబాటులో సూపర్ ప్లాన్స్

Jio Recharge Offers: కస్టమర్లకు జియో గుడ్‌న్యూస్ అందించింది. ఇప్పటికే అనేక ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోన్న జియో.. తన కస్టమర్ల కోసం ఓ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ప్రతి నెలా రీఛార్జ్‌ చేయకుండా ఒకేసారి మూడు నెలలకు రీఛార్జ్ చేసుకుంటే.. కొన్ని బెనిఫిట్స్ కూడా అందించనుంది.

రూ.719తో రీఛార్జ్ చేసుకుంటే.. 3 నెలలు అంటే 84 రోజుల పాటు మళ్లీ రీఛార్జ్ చేయాల్సిన పనిలేదు. అపరిమిత కాలింగ్‌తో పాటు 168 జీబీ డేటాను పొందుతారు. రోజుకు 2 జీబీ డేటాను మీరు వినియోగించుకోవచ్చు. అదేవిధంగా ప్రతిరోజు 100 ఎసెమ్మెస్‌లకు ఉచితంగా పంపించుకోవచ్చు. అంతేకాకుండా జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ వంటి యాప్స్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా పొందవచ్చు.

రూ.749తో రీఛార్జ్ చేసుకుంటే ఈ బెనిఫిట్స్‌తో పాటు వ్యాలిడిటీ 90 రోజల వరకు ఉంటుంది. రూ.666తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1.5 జీబీ డేటాతో పాటు 84 రోజులు అన్‌లిమిటెడ్ కాలింగ్, జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా పొందవచ్చు. 

మీరు ఒక నెలకు రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే.. రూ.239 ప్లాన్ ఎంచుకోవచ్చు. 28 రోజులపాటు అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు ఉచితంగా పంపించుకోవచ్చు. రూ.249 రీఛార్జ్ చేసుకుంటే.. అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజుకు 2 జీబీ డేటా వస్తుంది. అయితే కేవలం 23 రోజులు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. 209 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే.. అపరిమిత కాల్స్‌తో పాటు.. రోజు ఒక జీబీ డేటాను పొందవచ్చు. 28 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది.
 

Also Read: Komati Reddy Venkat Reddy: కోమటి రెడ్డి ఆడియో లీక్.. మునుగోడులో కలకలం

Also Read: Pawan Kalyan Vs Ambati Rambabu: నాలుగో పెళ్లాం.. అరగంట! పవన్ కల్యాణ్, అంబటి మధ్య రచ్చ రచ్చ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News