Facebook and Instagram Blue Tick Subscription: ట్విట్టర్ బాటలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా కూడా పయనిస్తోంది. కొంతకాలం క్రితం నుంచి బ్లూటిక్ కోసం ట్విట్టర్ డబ్బులు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదేతరహాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూటిక్ కోసం నెలవారీ చందా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. ఈ వారం నుంచి మెటా వెరిఫైడ్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. బ్లూ టిక్ సర్వీస్ కోసం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మొదట ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో ఈ ఫీచర్‌ను ప్రారంభిస్తున్నామని.. త్వరలోనే అన్ని దేశాల్లో అమలు చేస్తామన్నారు. 'మెటా వెరిఫైడ్' ఖాతాల వినియోగదారులకు వెరిఫికేషన్ బ్యాడ్జ్, ప్రాధాన్య కస్టమర్ సపోర్ట్, మరిన్నింటిని అందజేస్తాయన్నారు.
"మేము ఈ వారం మెటా వెరిఫైడ్‌ను ప్రారంభిస్తున్నాం. మీ ఖాతాను ప్రభుత్వ ఐడీతో బ్యూ బ్యాడ్జ్‌ని పొందడానికి ప్రభుత్వ ఐడీతో ధ్రువీకరించుకోవాలి. మీ గుర్తింపును ప్రపంచానికి తెలియజేసే సబ్‌స్క్రిప్షన్ సేవ.." అని మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. బ్లూ టిక్ కోసం వెబ్‌కు అయితే నెలకు $11.99 (రూ.991.65), మొబైల్‌కు నెలకు $14.99 (రూ.1,239.77) చొప్పున ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ కోసం చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త ఫీచర్ కోసం కనీసం 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. కచ్చితంగా ప్రభుత్వం నుంచి జారీ చేసిన ఐడీ కార్డు ఉండాలి.
గత కొన్ని రోజులుగా కొత్త సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ గురించి చర్చ జరుగుతోంది. అయితే మెటా ఇంకా ఈ సర్వీస్ గురించి పూర్తి వివరాలను వెల్లడించలేదు. మెటా వైరిఫైడ్ అనేది ప్రొఫైల్‌లను ధృవీకరించడానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది పేజీల కోసం కాదు.
ట్విట్టర్ బ్లూ టిక్ గతేడాది డిసెంబర్‌లో ప్రారంభించిన విషయం తెలిసిందే. భారత్‌లో ట్విట్టర్ బ్లూ టిక్ కోసం.. వినియోగదారులు వెబ్ వర్షన్‌కోసం నెలకు రూ.650, మొబైల్ వినియోగదారులు నెలకు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్న వాళ్లకు వెరిఫైడ్ బ్యాడ్జ్, ఇతర ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. తాజాగా ట్విట్టర్ తరహాలోనే మెటా కూడా వినియోగదారుల నుంచి బ్లూ బ్యాడ్జ్ కోసం సబ్‌స్క్రిప్షన్ పేరుతో డబ్బులు వసూలు చేయనుంది.
Also Read: Tamilisai Soundararajan: కిందపడిపోయిన గవర్నర్ తమిళిసై.. ఇదే బ్రేకింగ్ న్యూస్ అంటూ కామెంట్
Also Read: Tirumala Woman Death: బాత్‌రూమ్‌లోకి వెళ్లి నిప్పంటించుకుని.. తిరుమలలో మహిళ ఆత్మహత్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి