5G Services: దేశంలో 5జి ఇంటర్నెట్ సేవలు ప్రారంభమయ్యాయి. దశలవారీగా అన్ని నగరాలకు విస్తరించనున్న 5జి సేవలు..త్వరలో ఏపీలోని పలు నగరాలకు అందనున్నాయి. ఏపీ నగరాల్లో 5జి సేవల అవసరంపై రాజ్యసభ ఎంపీ జీవీఎల్ లేఖ రాశారు.
దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అక్టోబర్ 1న లాంఛనంగా 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 1-6 వరకూ జరుగుతున్న6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 కార్యక్రమం ప్రారంభంతో పాటు దేశంలో 5జీ సేవలకు శ్రీకారం చుట్టారు. తొలిదశలో దేశంలో 13 నగరాలకు 5 జీ సేవలు అందుతున్నాయి. ఇందులో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, చండీగఢ్, గురుగ్రామ్, హైదరాబాద్, లక్నో, పూణే, గాంధీనగర్, అహ్మదాబాద్, జామ్‌నగర్ ఉన్నాయి.
5జి సేవల విషయంలో రాజ్యసభ ఎంపీ జీవీఎల్..కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాశారు. విశాఖపట్నం సహా ఏపీలోని కొన్ని నగరాల్ల 5 జీ సేవలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. 5జి సేవల కోసం విశాఖపట్నం వ్యూహాత్మకత, ఆర్ధిక ప్రాముఖ్యతను ఎంపీ జీవీఎల్ లేఖలో వివరించారు. మరోవైపు దేశంలోని 13 నగరాల్లో 5జి సేవల్ని ప్రారంభించడం ద్వారా కొత్త డిజిటల్ యుగానికి నాంది పలికినందుకు ప్రధాని మోదీని అభినందించారు.
5జీ సేవల ద్వారా అల్ట్రా హై స్పీడ్ ఇంటర్నెట్ , 5 జి టెక్నాలజీ, డిజిటల్, ఆర్ధిక విప్లవం సాధ్యమౌతుందని జీవీఎల్ తెలిపారు. 5జీ సేవలు ప్రారంభించే రెండవ దశ నగరాల్లో ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి నగరాల్ని చేర్చాలని కేంద్రమంత్రిని కోరారు. విశాఖపట్నం నగరానికి 5జి సేవలు తక్షణ ప్రాధాన్యతగా తీసుకురావాలని తెలిపారు. విశాఖపట్నం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని..ఆర్ధిక వృద్ధికి ఓ ఇంజన్ లాంటిదని జీవీఎల్ చెప్పారు. విశాఖపట్నం నగరం తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయానికి కేంద్రమే కాకుండా..విశాఖపట్నం పోర్ట్, హిందూస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్, హిందూస్తాన్ పెట్రోలియం వంటి పరిశ్రమల్ని సంస్థల్ని కలిగి ఉందని వివరించారు. అందుకే విశాఖలో 5జి సేవల అవసరముందని స్పష్టం చేశారు.
ఆర్ధిక, వ్యూహాత్మక, భద్రతా కారణాలతో విశాఖపట్నం సహా ఇతర నగరాల్లో వెంటనే 5జీ సేవలు ప్రారంభించాలని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను అభ్యర్ధించారు.
Also read: SIP Benefits: ఎస్ఐపీ ఎలా ప్రారంభించాలి, అధిక లాభాలు రావాలంటే ఏం చేయాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook