Samsung A55 5G Price: సాంసంగ్ మార్కెట్‌లోని వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని కొత్త కొత్త స్మార్ట్ ఫోన్స్‌ను విడుదల చేస్తోంది. సంక్రాంతి సందర్భంగా సాంసంగ్ అతిశక్తివంతమైన కెమెరాతో కూడిన ఓ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. అతి తక్కువ ధరతోనే ఎక్కువ ఫీచర్లు కలిగిన A సిరీస్ మొబైల్‌ను కనుమ తర్వాత రోజున(జనవరి 17వ తేదీ) విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ కొరియన్ బ్రాండ్ Samsung తమ GalaxyA55 5G స్మార్ట్ ఫోన్‌ను అద్భుతమైన స్పెసిఫికేషన్‌లతో మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.
ఈ ఫోన్ అత్యుత్తమ టెక్నాలజీ ఫీచర్లతోపాటు 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతో రాబోతున్నట్లు సమాచారం. దీంతో పాటు ఈ Samsung స్మార్ట్‌ఫోన్ Exynos 1480 ప్రాసెసర్, Android 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రాబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇవే కాకుండా కంపెనీ మరెన్నో కొత్త ఫీచర్లతో ఈ మొబైల్లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ విషయానికొస్తే.. ఈ మొబైల్ అతి శక్తివంతమైన 5000mAh బ్యాటరీతో రాబోతోంది దీంతోపాటు 25 వాట్స్ చార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తోంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే లాంగ్ బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది అంతేకాకుండా తక్కువ ఛార్జింగ్ లో ఉండగా దాదాపు 13 నుంచి 14 గంటల పాటు బ్యాటరీ లైఫ్ లో ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.
Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ ధర:
ఇక ఈ మొబైల్ సంబంధించిన ధర విషయానికొస్తే..Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ రూ.20,000లోపు విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు. ప్రముఖ టిప్ స్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలను అతి త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని మొదట కంపెనీ 256 GB స్టోరేజ్‌తో వేరియంట్‌తో మార్కెట్‌లోకి విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter