Infinix Hot 40i: 16జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్, 50MP కెమేరాతో సూపర్‌ఫోన్ కేవలం 9 వేలకే

Infinix Hot 40i: మంచి స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. ప్రముఖ స్మార్ట్‌‌ఫోన్ కంపెనీ ఇన్‌ఫినిక్స్‌కు చెందిన సూపర్ పవర్‌ఫుల్ ఫోన్ చాలా తక్కువ ధరకే లభించనుంది. ఈ ఫోన్ ఫీచర్లు చూస్తే వావ్ అంటారు. అద్బుతమైన ఫీచర్లు కలిగిన ఫోన్ ఇంత తక్కువ ధరకా అని ఆశ్చర్యపోతారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 21, 2024, 12:37 PM IST
Infinix Hot 40i: 16జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్, 50MP కెమేరాతో సూపర్‌ఫోన్ కేవలం 9 వేలకే

Infinix Hot 40i: ఇటీవలి కాలంలో ఇన్‌ఫినిక్స్, పోకో వంటి స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లో క్రమంగా వాటా పెంచుకుంటున్నాయి. అద్భుతమైన ఫీచర్లతో పాటు అతి తక్కువ ధర కలిగి ఉండటంతో చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారుయ అలాంటిదే Infinix Hot 40i స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ ధర ఎంత, ఫీచర్లు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.

Infinix Hot 40i అనేది 6.6 ఇంచెస్ ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానెల్‌తో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ యూనిసాక్ టీ606 ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 720×1612 పిక్సెల్ రిజల్యూషన్, Mali G57 GPU ఉంటుంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడమే కాకుండా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. ఈ ఫోన్ 8 జీబీ రియల్, 8జీబీ వర్చువల్ ర్యామ్‌తో పనిచేస్తుంది. 16 జీబీ ర్యామ్ వరకూ సపోర్ట్ చేస్తుంది. ఇందులో 256 జీబీ స్టోరేజ్ సామర్ధ్యం ఉంటుంది. హోరైజన్ గోల్డ్, స్టార్ ఫాల్ గ్రీన్, స్టార్‌లిట్ బ్లాక్ , పామ్ బ్లూ రంగుల్లో లభ్యం కానున్న ఈ ఫోన్‌లో కెమేరాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లెన్స్ ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా,  ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 32 మెగాపిక్సెల్ కెమేరా ఉంది. 

అంటే 16జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ సామర్ధ్యం, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా, 5000 ఎంఐహెచ్ బ్యాటరీ వంటి టాప్ ఫీచర్లు కలిగిన Infinix Hot 40i స్మార్ట్‌ఫోన్ కేవలం 9000 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా మరో 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంటే Infinix Hot 40i ఫోన్ ధర మరింతగా తగ్గనుంది. ఇవి కాకుండా ఎక్స్చేంజ్ బోనస్ కింద 7500 తగ్గుతుంది. ఎక్స్చేంజ్ ఎంతనేది మీరు మార్చే ఫోన్ కండీషన్ , మోడల్, బ్రాండ్ బట్టి ఉంటుంది. 

Also read: FD Interest Rates: ఎఫ్‌డీపై అత్యధికంగా 9.60 శాతం వడ్డీ ఇచ్చే బ్యాంకులి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News