Tecno Camon 30 Premier 5G Features and Specifications: అతి తక్కువ ధరలో Tecno నుంచి 4 మొబైల్స్.. పూర్తి విరాలు ఇవే!

Tecno Camon 30 Premier 5G: అతి తక్కువ ధరలోనే మార్కెట్‌లోకి ప్రముఖ టెక్‌ కంపెనీ Tecno స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయ్యాయి. కంపెనీ  Camon 30 సిరీస్‌లో మొత్తం నాలుగు స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 28, 2024, 04:20 PM IST
Tecno Camon 30 Premier 5G Features and Specifications: అతి తక్కువ ధరలో Tecno నుంచి 4 మొబైల్స్.. పూర్తి విరాలు ఇవే!

Tecno Camon 30 Premier 5G: ప్రముఖ టెక్‌ కంపెనీ టెక్నో తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌ని లాంఛ్‌ చేసింది. కంపెనీ Camon 30 సిరీస్‌లో విడుదల చేసినట్లు తెలిపింది. ఈ సిరీస్‌లో మొత్తం నాలుగు (టెక్నో Camon 30, టెక్నో Camon 30 5G, టెక్నో Camon 30 Premier 5G, టెక్నో Camon 30 Pro 5G) ఫోన్‌లు ఉన్నాయి. ఈ మొబైల్స్‌ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చాయి. అలాగే ప్రీమియం క్వాలిటీతో ఈ మొబైల్‌ 50 మెగాపిక్సెల్‌ల సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో కూడిన డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. ఇవే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ చాలా రకాల ఫీచర్స్‌తో అందుబాటులో ఉంది. ఆ ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Tecno Camon 30 Premier 5G, Pro 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్స్‌:
ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీని స్క్రీన్‌ 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్‌ చేస్తుంది. అంతేకాకుండా ఈ రెండు ప్రీమియం వేరియంట్స్‌ LTPO టెక్నాలజీకి సపోర్ట్‌ చేస్తుంది. అలాగే ఈ వీటి డిస్ల్పే  1.5K రిజల్యూషన్‌ను కలిగి ఉంటాయి. ఇక ప్రో వేరియంట్‌లో మాత్రం పూర్తి HD+ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌ 8 GB ర్యామ్‌, 256 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇక ప్రీమియర్ వేరియంట్‌ మాత్రం 12 GB ర్యామ్‌, 512 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది.  

ఇక ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌ ప్రాసెసర్‌ వివరాల్లోకి వెళితే..ఈ Tecno Camon 30 Premier 5G, Pro 5G స్మార్ట్‌ఫోన్స్‌ MediaTek Dimension 8200 చిప్‌సెట్‌పై పని చేస్తాయి. అంతేకాకుండా డ్యూయల్ LED ఫ్లాష్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ Sony IMX890 ప్రధాన కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరాలతో అందుబాటులోకి వచ్చింది. ఇవి రెండు స్మార్ట్‌ఫోన్స్‌ 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలను కలిగి ఉంటాయని కంపెనీ వెల్లడించింది. దీంతో పాటు ప్రీమియం వేరియంట్‌లో అదనపు 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ సెన్సార్ కెమెరా కూడా అందుబాటులో ఉంది.   

ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..

Techno Camon 30 5G, Techno Camon 30 స్పెసిఫికేషన్స్‌, ఫీచర్స్‌:
ఈ Techno Camon 30 5G, Techno Camon 30 స్మార్ట్‌ఫోన్స్‌ 6.78 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేలను కలిగి ఉంటాయి. దీంతో పాటు ఈ డిస్ల్పే 1080x2436 పిక్సెల్ రిజల్యూషన్‌తో అందుబాటులో ఉంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్‌ చేస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్స్‌ 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దీంతో పాటు 70 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ని సపోర్ట్‌, 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా వంటి ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు ఇవి MediaTek Helio G99 ప్రాసెసర్‌పై రన్‌ అవుతాయి. 

ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News