Vivo S18e, S18, S18 Pro: వీవో లవర్స్‌కి గుడ్ న్యూస్..అతి త్వరలోనే మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల కాబోతోంది. వీవో కంపెనీ త్వరలో తమ S సిరీస్ కొత్త ఫోన్‌లను( Vivo S18e, S18, S18 Pro)ని విడుదల చేయనుంది. ఈ మొబైల్స్‌ను డిసెంబర్ 14 మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్స్‌కి సంబంధించిన స్పెసిఫికేషన్‌లను కూడా విడుదల చేసింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్ అద్భుతమైన కెమెరాను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఈ మొబైల్స్ 100 వాట్ల వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Vivo S18e:
ఈ వీవో S18e సిరీస్ స్మార్ట్ ఫోన్ బేస్ వేరియంట్‌లో రాబోతోంది. ఈ మొబైల్ ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఫోటోగ్రఫీ కోసం ఆరా LED ఫ్లాష్ లైట్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రధాన కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు 4800mAh బ్యాటరీ, 80 Watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రాబోతోంది. ఈ మొబైల్ క్లౌడ్ గేజ్ వైట్, గ్లో పర్పుల్, స్టార్రీ నైట్ బ్లాక్ కలర్స్‌లో విడుదల కాబోతోంది.
Vivo S18, S18 Pro:
ఈ Vivo S18, S18 Pro స్మార్ట్ ఫోన్స్ S18 స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్‌తో రాబోతోంది. ఇక S18 ప్రో డైమెన్షన్ 9200 ప్లస్ ప్రాసెసర్‌తో వస్తోంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ హోగ్గియా రెడ్, బ్లాక్, పర్పుల్, సీ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో విడుదల కాబోతోంది. Vivo S18 స్మార్ట్ ఫోన్‌కి సంబంధించి కెమెరా వివరాలను త్వరలోనే విడుదల చేయబోతోంది.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
S18 ప్రోకి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే..ఈ మొబైల్ డ్యూయల్ సాఫ్ట్ LED ఫ్లాష్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో రాబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ కెమెరా సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు 50-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్ కెమెరాను కలిగి ఉంటుంది. 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 12-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ లెన్స్ కెమెరాతో రాబోతోంది. ఈ Vivo S18 స్మార్ట్ ఫోన్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను కలిగి ఉంటుందని సమాచారం. మొదట ఈ స్మార్ట్ ఫోన్‌ను చైనాలో విడుదల చేయబోతోంది.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి