Xiaomi Robot Vacuum Cleaner S10 Price: అభివృద్ధి చెందిన దేశాల్లో సాంకేతికత రోజురోజుకు రెట్టింపు అవుతోంది. దీని కారణంగా దేశాలు మరింత అభివృద్ధి చెందుతున్నాయి. పెరుగుతున్న సాంకేతికతను దృష్టిలో పెట్టుకుని టెక్ కంపెనీలు అన్నీ ప్రీమియం ఫీచర్సతో కొత్త పరికారాలను తయారు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవలే క్లీనింగ్ రోబోట్ అందుబాటులోకి వచ్చింది. దీనిని అభివృద్ధి చెందిన దేశాల్లో రోబోవాక్స్ లేదా రూంబాస్ అని కూడా పిలుస్తారు. ఇది ఇంటిని శుభ్రంగా చేయడమే కాకుండా ఇంట్లో ఫ్లోర్‌పై ఉండే మురికి మరకలను కూడా సులభంగా తొలగిస్తుంది. దీంతో పాటు ఇందులో ఉండే ప్రత్యేకమైన సెన్సార్లు మురికిని బట్టి ఈ రోబోట్‌కి బ్రష్‌లను సలహా ఇస్తాయి. ఈ రోబోవాక్స్ ఇంట్లోని ఇతర క్లినింగ్ పనులు చేసేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది.
ఇటీవలే ప్రముఖ టెక్ షియోమి స్మార్ట్ లివింగ్ 2024 ఈవెంట్‌లో కొత్త రోబోవాక్స్‌ను పరిచయం చేసింది. దీనిని Xiaomi కంపెనీ రోబోట్ వాక్యూమ్ క్లీనర్ S10 బ్రాండ్ పేరుతో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఇది అనేక రకాల ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఇందులో ఉండే ప్రత్యేమైన ఫీచర్ ఇంటిలోని ప్రతి మూలను క్లీన్ చేసే ప్రత్యేకమైన సెన్సార్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు బట్టలను ఇస్త్రీ చేయాడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. అలాగే ఇవే కాకుండా ఇది అనేకమైన ప్రత్యేకమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది.
రోబోట్ వాక్యూమ్ క్లీనర్ S10 ఫీచర్లు:
Xiaomi స్మార్ట్ హోమ్ రోబోట్ వాక్యూమ్ క్లీనర్ ప్రత్యేకమైన పోర్ట్‌ఫోలియోలో చైనా, ఇతర దేశాల మార్కెట్‌లో లాంచ్ అయ్యింది. అయితే భారత్‌లో లాంచ్ అయిన ఈ వాక్యూమ్ క్లీనర్ మాత్రం ప్రత్యేకమైన టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చింది. ఇది S10ని 4,000pa సక్షన్ పవర్ సెటప్‌తో లభిస్తోంది. దీంతో పాటు ఈ రోబోట్ క్లినింగ్ చేసే క్రమంలో జిగ్‌జాగ్, Y-ఆకారపు మ్యాపింగ్‌కు కూడా సులభంగా సపోర్ట్ చేస్తుందని కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా ఇది క్లీన్ చేసిన మ్యాపింగ్‌ను కూడా సేవ్ చేసుకునే ప్రత్యేకమైన స్టోరేజ్‌తో లభిస్తోంది. దీంతో పాటు ఈ రోబోట్‌కి టూ-ఇన్-వన్ కంటైనర్ సెటప్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో క్లీన్ చేసిన దుమ్మ, మురికి డిస్ల్పే చేస్తుంది.
Xiaomi హ్యాండ్‌హెల్డ్ గార్మెంట్ స్టీమర్ ఫీచర్స్:
ఈ హ్యాండ్‌హెల్డ్ గార్మెంట్ స్టీమర్ కంపెనీ ఎంతో సులభమైన ప్రత్యేమైన డిజైన్‌తో మార్కెట్‌లోకి అందుబాటులో తీసుకువచ్చింది. ఇది 1300W శక్తితో పని చేస్తుంది. దీంతో పాటు ఈ గార్మెంట్ స్టీమర్ ప్రతి నిమిషానికి 24 గ్రాముల ఆవిరి రేటును కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇది బట్టలకు ఉన్న బ్యాక్టీరియా, అలర్జీలను 100 శాతం తొలగించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. దీంతో పాటు బట్టలలో సువాసనను నింపేందుకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ధర, పూర్తి వివరాలు:
ఈ రోబోట్ వాక్యూమ్ క్లీనర్ S10ను Xiaomi కంపెనీ ఇటీవలే అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిని ధర రూ.19,999తో మార్కెట్‌లో విక్రయిస్తోంది. అలాగే దీనిని అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేస్తే దాదాపు రూ.1000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా లాంచింగ్ ఆఫర్ కింద ధర రూ. 2,299కి ప్రత్యేకమైన తగ్గింపును కూడా అందిస్తోంది. అయితే ఇది అన్ని ఈ కామర్స్ వెబ్‌సైట్స్‌లో ఏప్రిల్ 29 నుంచి అందుబాటులోకి రాబోతోంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి