Liquor Brands: తెలంగాణ మద్యం విధానంలో మార్పులు జరగనున్నాయి. ఇప్పటికే బీర్ల సరఫరా నిలిపివేయడంతో మద్యంపై ఉత్కంఠ ఏర్పడగా.. ఈ క్రమంలో కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ విధానంలో మార్పులు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా మద్యం కొత్త బ్రాండ్ల కంపెనీపై ప్రభుత్వం సమీక్ష చేపట్టింది.
Also Read: Retirement Benefits: ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల కీలక అడుగు.. రిటైర్డ్ బెనిఫిట్స్ కోసం న్యాయపోరాటం
రాష్ట్రంలో మద్యం సరఫరా చేసేందుకు ముందుకు వచ్చే కంపెనీలను ఎంపిక చేసేందుకు పారదర్శక విధానం పాటించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే టీజీబీసీఎల్‌కు సరఫరా చేస్తున్న కంపెనీలు కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు సులభతర వాణిజ్య విధానం అనుసరించాలని చెప్పారు. కొత్త కంపెనీలను అనుమతించే విషయంలో కట్టుదిట్టంగా ఉండాలని ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
Also Read: Sankranti Special: సంక్రాంతికి బాంబు పేల్చిన తెలంగాణ ఆర్టీసీ.. ప్రత్యేక బస్సుల్లో భారీగా ధరల పెంపు
కొత్త కంపెనీల నుంచి దరఖాస్తులు తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసి.. కనీసం నెల రోజులు నిర్ణీత గడువు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ కంపెనీలు తమ బ్రాండ్ల పేర్లతో దరఖాస్తు చేసుకోవాలని.. ఆ కంపెనీల నాణ్యత ప్రమాణాలు, సరఫరా సామర్థ్యం పరిశీలించి పారదర్శకంగా ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టాలని సూచించారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఎక్సైజ్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఇటీవల యునైటెడ్ బేవరేజస్ కంపెనీ బీర్ల రేట్లను 33.1 శాతం పెంచాలని ఒత్తిడి చేసిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. కంపెనీల ఒత్తిడికి తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. పొరుగున ఉన్న ఏపీ, మహారాష్ట్ర తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీర్ల ధరలను పరిశీలించాలని అధికారులు చెప్పారు. హైకోర్ట్ రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ నివేదిక ఆధారంగా ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.