CM KCR Kondagattu tour: ఇవాళ సీఎం కేసీఆర్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అధికారులతో అంజన్న క్షేత్ర అభివృద్ధికి సంబంధించి సీఎం సమీక్ష నిర్వహించారు. దాదాపు రెండు గంటలపాటు సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ఆలయ డెవలప్ మెంట్ కు రూ.100కోట్లు కేటాయించామని.. ఇప్పుడు మరో రూ.500కోట్లు ఇస్తామని ఆయన తెలిపారు. దేశంలోని ప్రముఖ ఆంజనేయ క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. ఆగమశాస్త్రం ప్రకారం తీసుకోవాల్సిన చర్యలపై కూడా సలహాలు ఇచ్చారు.
దాదాపు 25 ఏళ్ల తర్వాత కొండగట్టుకు వచ్చారు కేసీఆర్. 1998లో కేసీఆర్ రాగా.. తాజాగా సీఎం హోదాలో ఇక్కడకు వచ్చారు. గత ఏడాది డిసెంబర్ 7న జగిత్యాలకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. మోతెలో జరిగిన భారీ బహిరంగ సభలో కొండగట్టు, ధర్మ పురి, వేములవాడ రాజన్న ఆలయాల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ ఆలయాల అభివృద్ధి కోసం చేపట్టబోయే ప్రణాళికలను కూడా వివరించారు. ఉత్తర తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఈ అంజన్న ఆలయం ఉంది. ఈ గుడికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తుల భారీగా తరలివస్తూంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook