Podu Bhoomulu Patta Distribution to Tribals by CM KCR on 30th June 2023: గిరిజనులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో జూన్ 30వ తేదీ నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వారి వారి జిల్లాలు, నియోజకవర్గాల్లో జూన్ 30వ తేదీనే పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారని అధికారులు వెల్లడించారు. అయితే గతంలో జూన్ 24వ తేదీ నుంచి పోడు భూముల పంపిణీని ప్రారంభించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కానీ అనివార్య కారణాల వల్ల ఈ నెల 30వ తేదీకి వాయిదా వేశారు.
తెలంగాణలో జాతీయ ఎన్నికల కమిటీ పర్యటిస్తుండగా.. ఇందుకు సంబంధించి అన్ని జిల్లా కలెక్టర్లకు రెండు రోజులు శిక్షణా తరగతులు నిర్వహించారు. అదేవిధంగా ఈ నెల 29న బక్రీద్ పండుగ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే జూన్ 24వ తేదీ నుంచి జూన్ 30వ తేదీకి మార్చారు. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అధికారులు ఆసిఫాబాద్ జిల్లాలో పోడు పంపిణీ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: Aadhaar Card Photo Change: 8 ఏళ్ల బాలుడి ఆధార్ కార్డులో డిప్యూటీ సీఎం ఫొటో
నూతనంగా పోడు పట్టాలు పొందనున్న గిరిజనులకు రైతుబంధు వర్తింపజేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఆర్ఓఎఫ్ఆర్ ద్వారా రైతుబంధు పొందుతున్న వారితో పాటు నూతనంగా పోడు పట్టాలు అందుకోనున్న గిరిజన లబ్దిదారులతోనూ క్రోడికరించనున్నారు. మిగిలిన లబ్ధిదారులకు రైతు బంధు ఎలా అందుతుందో.. పోడు భూముల పట్టాలు సొంతం చేసుకున్న వారికి కూడా ఈ పథకం అందేలా చర్యలు తీసుకోనున్నారు. పోడు భూములు అందుకున్న లబ్ధిదారులకు ప్రభుత్వమే బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేయించి.. నేరుగా వారి అకౌంట్‌లలోకి రైతుబంధును ప్రభుత్వం జమ చేయనుంది. పోడు పట్టాలు అందుకున్న గిరిజన రైతుల బ్యాంక్ వివరాలను ఆర్థిక శాఖ వారికి అందజేయనున్నారు.
Also Read: Maa Awara Zindagi Movie Review: మా ఆవారా జిందగీ మూవీ రివ్యూ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి