హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో విభేదాలు మరో మారు బహిర్గతమయ్యాయి. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్ధి ఎంపిక విషయంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు మీడియాలో కథనాలు వెలుడుతున్నాయి. ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పద్మావతి పేరు ఎలా ప్రకటిస్తారని రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ప్రముఖ మీడియా కథనం గోల్కొండ హోటల్ లో బుధవారం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియాతో భేటీ అయిన మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి టి పీసీసీ చీఫ్ ఉత్తమ్ వ్యవహారశైలిపై ఫిర్యాదు చేశారు. అభ్యర్ధిని ప్రకటించే విషయంలో ఉత్తమ్ కు షోకాజ్ ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని రేవంత్ తో కుంతియా అన్నట్లు తెలిసింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజుర్ నగర్ నుంచి పోటీ ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఇటీవలె జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తాను ఎమ్మెల్యే పదవికి రాజానామా చేయాల్సి వచ్చింది. దీంతో ఆయన పోటీ చేసిన హుజుర్ నగర్ అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో హుజూర్నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా తన సతీమణి పద్మావతి పోటీచేస్తారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఇది కాస్త వివాదంగా మారింది.