Congress MLA Candidates List: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ రెడీ అయింది. త్వరలోనే 119 అభ్యర్థుల ఫైనల్ జాబితాను ప్రకటించనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. చార్మినార్ నియోజకవర్గం నుంచి అలీ మస్కతీని పోటీ చేయాలని పార్టీ సూచించిందని.. కుటుంబ సభ్యులతో చర్చించి వారి నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తోందని.. రాజకీయ సునామీ రాబోతుందన్నారు. ఈ సునామీలో బీజేపీ, బీఆర్‌ఎస్ కొట్టుకుపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. పదేళ్లుగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రజలకు ద్రోహం చేశాయని ఫైర్ అయ్యారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలతో పాటు మరో ముఖ్యమైన గ్యారంటీని ఇస్తున్నామని తెలిపారు.
“ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని అందించే గ్యారంటీని కాంగ్రెస్ ఇస్తోంది. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్ని సర్వేలు చెబుతున్నాయి. అందుకే బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయి. రాష్ట్ర డీజీపీ, స్టీఫెన్ రవీంద్ర, ప్రభాకర్ రావు, వేణుగోపాల్ రావు, నర్సింగ్ రావు భుజంగరావు అంతా ఒక ప్రయివేటు సైన్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో చాలా మంది రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన అధికారులను ఎన్నికల కోడ్ రాగానే ఎన్నికల అధికారులు వారిని తొలగించాలి. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీజీపీ రాధాకిషన్ రావు ఒక ప్రయివేటు సైన్యాధిపతిగా మారారు. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు
కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నవారిని ప్రత్యక్షంగా బెదిరిస్తున్నారు. స్టీఫెన్ రవీంద్రపై నేను సూటిగా ఆరోపణలు చేస్తున్నా.. మైనారిటీలు బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని వారిని బెదిరిస్తున్నారు. ఈ అధికారులంతా ఎన్నికల కోసం బీఆర్ఎస్ అభ్యర్థుల డబ్బులను రవాణా చేస్తున్నారు. అరవింద్ కుమార్, జయేష్ రంజన్, సోమేశ్ కుమార్.. బీఆర్ఎస్‌కు చందాలు ఇవ్వాలని వ్యాపారస్థులపై ఒత్తిడి తెస్తున్నారు. వీరిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధాన అధికారికి విజ్ఞప్తి చేస్తున్నా.. రిటైర్ అయిన పోలీసు అధికారులను వెంటనే తొలగించాలి.” అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్న 75 మంది వివరాలను కేటీఆర్ కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు అందించారని.. వారి ఫోన్‌లపై నిఘా పెట్టి బీఆర్‌ఎస్, బీజేపీ సమన్వయంతో ముందుకు వెళుతోందని ఆయన ఆరోపించారు. ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘనేని.. ఈ అధికారులందరిపై కాంగ్రెస్ రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తుందని తెలిపారు. ఎన్నికల అధికారులు స్పందించకపోతే న్యాయస్థానం తలుపు తడతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ విధి విధానాలు కేటీఆర్‌కు తెలియవని.. టికెట్ల కేటాయింపులో తమ పార్టీలో ఒక విధానం ఉందన్నారు. తన ఒక్కడి నిర్ణయంతో టికెట్ల ప్రకటన జరగదని.. టికెట్ల కేటాయింపులో సీఈసీ నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు. ప్రజలకు ముఖం చూపించలేకే కాంగ్రెస్‌పై కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని.. ఇలాంటి చిల్లర మల్లర ఆరోపణలను పట్టించుకునే పరిస్థితిలో తాము లేమని స్పష్టం చేశారు.
Also Read: Hyderabad: ఇద్దరు కూతుళ్లకు నిద్రమాత్రలు ఇచ్చి చంపేసిన తండ్రి.. వెంటనే తానూ కూడా..!
Also Read: World Cup 2023 Points Table: టాప్ ప్లేస్‌కు దూసుకువచ్చిన సఫారీ.. టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి