Foramer DGP Mahender Reddy: తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్పీఎస్సీను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2, ఎక్జామ్ లు లీకేజీలు కావవడంతో టీఎస్పీఎస్సీపై ఎగ్జామ్ ల నిర్వహణపై అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో అధికారంలోకి రాగానే గత కమిషన్ చైర్మన్, సభ్యులంతా రాజీనామాలు చేశారు.
ఈ క్రమంలో నూతన చైర్మన్, సభ్యుల నియామకంపై ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. దీనిలో భాగంగానే సర్కారు తాజాగా.. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్సీ కి చైర్మన్ గా ప్రతిపాదించింది. ఈ నియామకానికి గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. కాగా గతంలో మహేందర్ రెడ్డి డీజీపీగా పనిచేసి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాజీనామా చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook