COVID-19 updates from Telangana: హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారి విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం అంతకు ముందు గడిచిన 24 గంటల్లో 1,19,537 మందికి కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,197 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యధావిధిగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో (GHMC) అత్యధికంగా 137 కేసులు నమోదు కాగా ఆ తర్వాత నల్గొండ జిల్లాలో 84 పాజిటివ్ కేసులు, సూర్యాపేట జిల్లాలో 72 పాజిటివ్ కేసులు, మేడ్చల్- మల్కాజ్‌గిరి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 71 కేసులు చొప్పున నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య 6,14,399 కు చేరింది.
అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 1,707 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా.. మరో 9 మంది కరోనాతో చికిత్స పొందుతూ చనిపోయారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 5,93,577 మంది కరోనా వైరస్ నుంచి కోలుకోగా.. కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 3,576కి పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో (Telangana) 17,246 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Also read : TS CETs schedules: తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షల తేదీల వివరాలు
మొత్తానికి ఇటీవల కాలంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్స్‌ని పరిశీలిస్తే.. కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య తగ్గి, రికవరీ రేటు పెరుగుతోంది. దీంతో యాక్టివ్ కేసులు (COVID-19 cases) కూడా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.
Also read: Vaccine Drive: వ్యాక్సినేషన్‌లో ఏపీ రికార్డు, ఒకేరోజు 13 లక్షలమందికి వ్యాక్సినేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook