Hyderabad: కిచెన్ లో ఎలుకలు, బొద్దింకలు..శ్రీచైతన్య విద్యా సంస్థల సెంట్రల్ కిచెన్ లైసెన్స్ రద్దు

Hyderabad: హైదరాబాద్ మాదాపూర్ లోని శ్రీచైతన్య విద్యా సంస్థలకు సంబంధించి సెంట్రల్ కిచెన్ లైసెన్స్ ను ఫుడ్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ రద్దు చేసింది. వంటగదిలో ఆహార తయారీని తక్షణమే నిలిపివేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు ఉల్లంఘించి వంట తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చింది. 

Written by - Bhoomi | Last Updated : Jan 26, 2025, 08:29 PM IST
Hyderabad: కిచెన్ లో ఎలుకలు, బొద్దింకలు..శ్రీచైతన్య విద్యా సంస్థల సెంట్రల్ కిచెన్ లైసెన్స్ రద్దు

Hyderabad: మాదాపూర్ లోని శ్రీ చైతన్య విద్యా సంస్థల సెంట్రల్ కిచెన్ లైసెన్స్ ను తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ రద్దు చేసింది. శుక్రవారం ఈ కిచెన్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ కిచన్ నుంచే గ్రేటర్ హైదరాబాద్ లోని చైతన్య కాలేజీలకు హాస్టళ్లకు ఫుడ్ సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్కడ వండే భోజనాన్ని హాస్టళ్లలోని వేలాది మంది విద్యార్థులకు రోజూ అందిస్తుంటారు. 

అయితే వేలాది మంది విద్యార్థులకు తయారు చేస్తున్న కిచెన్ అపరిశుభ్రంగా ఉండటంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు పైర్ అయ్యారు. కిచెన్ లో పాడైపోయిన ఆహార పదార్థాలు నిల్వ ఉన్నట్లు గుర్తించారు. సుమారు 125 కిలోల గడువు తీరిన ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. బియ్యం, కూరగాయలు, పప్పు దినుసులను కూడా అపరిశుభ్రత వాతావరణంలో స్టోర్ చేసినట్లు గుర్తించారు. 

Also Read: EGG Price: అమెరికాలో గుడ్ల ధరలకు రెక్కలు.. 12 గుడ్లకు..600 రూపాయలపైనే..ట్రంప్ వచ్చాక అమాంతం పెరిగిన ధర   

ఇక వంటగది, స్టోర్ రూములో బొద్దింకలు, ఎలుకలు తిరుగుతున్నట్లు గుర్తించారు అధికారులు. కిచెన్ ను సీజ్ చేయడంతోపాటు ఫుడ్ లైసెన్స్ ను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఈ మేరకు అధికారులు మాధాపూర్ లోని చైతన్య విద్యాసంస్థల సెంట్రల్ కిచెన్ లైసెన్స్ ను రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. వంటగదిలో ఆహార తయారీని తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర్వులు ఉల్లంఘించి వంట చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. 

Also Read: Tax Benefits: మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే ఈ స్కీమ్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి..లేదంటే భారీగా నష్టపోతారు   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News