Cm Revanth Meeting Today: కాంగ్రెస్ ప్రభుత్వం రేపటి నుంచి నాలుగు పథకాలను అమలు చేయనుంది. ఈ నేపథ్యంలో నేడు శనివారం రోజు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ పై అధికారులతో మాట్లాడుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పథకాలను అమలు చేయనుంది. మొదట మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రారంభించింది. ఆ తర్వాత 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500 సిలిండర్ అమలు చేసింది.
ఇప్పుడు తాజాగా ఇందిరమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డులతోపాటు మరో రెండు పథకాలను అమలు చేయనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో పథకాలపై సమీక్ష నిర్వహించనున్నారు. లబ్ధిదారుల ఎంపికలో కొన్ని చోట్ల నెలకొన్న గందరగోళ పరిస్థితులపై చర్చించనున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 16,348 గ్రామ వార్డు సభలు పూర్తయ్యయని ప్రభుత్వం ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభయ హస్తంలో భాగంగా ఈ పథకాల అమలుకు దరఖాస్తులు కూడా స్వీకరించింది. కొన్ని లక్షల్లో పథకాలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, ఫ్రీ సిలిండర్, ఉచిత విద్యుత్, మహిళలకు రూ.2500 పథకాలకు దరఖాస్తు చేసుకున్నారు.
రైతు భరోసా..
రైతు భరోసా పథకంలో భాగంగా వ్యవసాయ భూములు ఎకరానికి రూ.6000 చొప్పున సాయం అందించనుంది. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా తెలంగాణ ప్రభుత్వం విధివిధానాలను విడుదల చేసింది. అయితే ఈ పథకాలన్నీ పగడ్బందీగా అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రైతు భరోసా నిధుల విడుదల కూడా జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల ముహూర్తం ఫిక్స్ చేశారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా...
ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో భాగంగా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. జాబ్ కార్డు ఉన్నవారికి రూ. 12000 అందించనుంది. ప్రభుత్వ భూమిలేని రైతు కూలీ లు ఈ పథకానికి అర్హులు చేయాలని వ్యవసాయ శాఖ సంఘం కోరుతోంది.
ఇదీ చదవండి : ఆధారాలు దొరికాయ్..! ఇన్‌ఫ్రారెడ్ టెక్నాలజీతో మాధవి ఆనవాళ్లు గుర్తింపు..
కొత్త రేషన్ కార్డులు..
ఇక కొత్త రేషన్ కార్డులో కూడా ఎన్నో రోజులుగా కొన్ని లక్షల మంది ఎదురుచూస్తున్నారు. అభయ హస్తంలో భాగంగా భారీ మొత్తంలో ఈ రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. వాటి వడపోతలో కాస్త గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల స్వీకరణ కూడా చేపట్టనుంది. ఎన్నో రోజులుగా తెలంగాణలో కొత్త రాష్ట్ర రేషన్ కార్డుల జారీ కాలేదు. ఈ నేపథ్యంలో పథకాలు కూడా రేషన్ కార్డుతో ముడిపెట్టడంతో పెద్ద మొత్తంలో ప్రజలు కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ఎదురుచూస్తున్నారు.
ఇదీ చదవండి : కేసీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం.. కేటీఆర్ దిగ్భ్రాంతి
ఇందిరమ్మ ఇల్లు..
ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా ఖాళీ జాగా ఉన్నవారికి ఐదు లక్షలు మంజూరు చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వనుంది. ఈ పథకంలో వికలాంగులు, ఒంటరి మహిళలు, శానిటరీ వర్కర్లకు ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇప్పటికే దాదాపు అర్హులను ఎంపిక చేశారు. కొన్ని చెట్ల గందరగోళం పరిస్థితులు నెలకొనడం నెలకొల్పడంతో ఈరోజు దానిపై చర్చించనున్నారు. అంతే కాదు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియనే మంత్రులు కూడా చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter