AI Anaconda Snake In Prayagraj kumbh mela: ప్రయాగ్ రాజ్ కుంభమేళలో ప్రతిరోజు లక్షలాదిగా మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటి వరకు కొన్ని కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు ప్రయాగ్ రాజ్ కు తండోప తండాలుగా తరలివస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కల్గకుండా యోగి సర్కారు అనేక చర్యలు చేపట్టింది. దాదాపు.. 144 ఏళ్ల తర్వాత ఏర్పడిన మహాకుంభమేళ కావడంతో భక్తులు భారీగా వస్తున్నారు.
ఈ క్రమంలో ప్రస్తుతం కుంభమేళలో 13 అఖాడాలకు చెందిన సాధులు, సంత్ లు, అఘోరీలు, భారీగా తరలివస్తున్నారు. కుంభమేళకు సంబంధించిన ఒక షాకింగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. దీనిలో భారీ అనకొండ కుంభమేళ నదిలో ప్రత్యక్షమైంది. అక్కడ స్నానం చేస్తున్న వారు ఆ భారీ అనకొండను చూసి భయంతో దూరంగా వెళ్లిపోయారు.
ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అది ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో క్రియేట్ చేసిన పాము. ఇటీవల ఏఐ టెక్నాలజీతో చాలా మంది నటీ నటుల .. ఫోటోలు క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది ఏఐ టెక్నాలజిని కొంత వరకు మిస్ యూస్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఈ భారీ సర్పం సైతం.. ఏఐ టెక్నాలజీతో రూపొందించించారు. అయితే.. ఈ వీడియోను చూసిన కొంత మంది మాత్రం.. ఫస్ట్ లో.. ఇది నిజమైన సర్పం కావోచ్చని కూడా షాక్ అయ్యారు. ఆతర్వాత అసలు విషయం తెలిసి.. నవ్వుకున్నారంట.