Body Parts Cooked: ఘోరాతి ఘోరం.. భార్యను హత్య చేసి కుక్కర్‌లో ఉడికించిన భర్త

Dare To Read These Incident Husband Killed His Wife And Cooked Body Parts In Cooker: మృగాల కన్నా దారుణంగా మానవులు వ్యవహారిస్తున్నారని చెప్పడానికి హైదరాబాద్‌లో చోటుచేసుకున్న అత్యంత దారుణ హత్య నిదర్శనంగా నిలుస్తోంది. భార్యను చంపి కుక్కర్‌లో ఉడకబెట్టిన ఉదంతం సంచలనం రేపుతోంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 22, 2025, 10:08 PM IST
Body Parts Cooked: ఘోరాతి ఘోరం.. భార్యను హత్య చేసి కుక్కర్‌లో ఉడికించిన భర్త

Wife Body Parts Cooked In Cooker: రోజురోజుకు మానవుడు మృగంగా మారిపోతున్నాడా? అని కొన్ని అత్యంత దారుణ సంఘటనలు చూస్తే అనిపిస్తుంటుంది. ఇన్నాళ్లు దేశంలో వివిధ ప్రాంతాల్లో ఘోరాతి ఘోర సంఘటనలు చోటుచేసుకోగా తాజాగా తెలంగాణలో ఓ సంచలన సంఘటన చోటుచేసుకుంది. భార్యను ఎవరూ ఊహించని స్థాయిలో అతడు హత్య చేశాడు. రాయలేని స్థితిలో అతడు అంతటి క్రూరంగా వ్యవహరించాడు. భార్య మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోసం అనంతరం కుక్కర్‌లో ఉడకపెట్టాడు. అనంతరం మృతదేహానికి సంబంధించిన భాగాలను చెరువులో పడేశాడు. ఇంతటి ఘోర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా సృష్టించింది. ఈ దారుణ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Hezbollah Commander: హిజ్బుల్లాకు బిగ్ షాక్.. టాప్ కమాండర్ హత్య   

హైదరాబాద్‌ రాచకొండ కమిషనరేట్ మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి డీఆర్‌డీఓలో ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో సెక్యూరిటీగా పని చేస్తున్నాడు. జిల్లెల్లగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో భార్య వెంకట మాధవి (35)తో కలిసి నివసిస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Also Read: Retirement Age Increase: ప్రభుత్వ ఉద్యోగులకు 'కొత్త టెన్షన్‌'.. రిటైర్మెంట్‌ వయస్సు 65 ఏళ్లకు పెంపు?

ఈనెల 13వ తేదీన మాధవి కనిపించడం లేదని మీర్‌పేట్‌ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసే సమయంలో తనకు ఏం తెలియదు అన్నట్టుగా అత్తామామలతో కలిసి గురుమూర్తి పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా గురుమూర్తిపై అనుమానం కలిగింది. తమదైన శైలిలో పోలీసులు విచారణ చేపట్టగా అతడు చేసిన దారుణం వెలుగు చూసింది. ఎంత క్రూరంగా భార్యను హతమార్చాడో తెలుసుకుని పోలీసులు ఖంగుతిన్నారు.

ఈ సంఘటనకు సంబంధించి విషయాలు పోలీసులు గోప్యంగా ఉంచారు. హత్యలో ఘోరమైన విషయాలు ఉండడంతో పోలీసులు వివరాలు బయటకు తెలపలేదు. విశ్వసనీయంగా తెలిపిన సమాచారం ప్రకారం.. నిందితుడు గురుమూర్తి భార్యను చంపడానికి ముందు ఓ కుక్కను చంపి.. ఆ తర్వాత భార్యను హతమార్చినట్లు తెలుస్తోంది. హత్య చేశాక భార్యను ముక్కలు ముక్కలుగా నరికి అనంతరం కుక్కర్‌లో ఉడక పెట్టాడని సమాచారం. ఆ ముక్కలను ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News