Gurumurthy Murder case: మీర్‌పేట మహిళ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. మరో మహిళతో యవ్వారం పెట్టుకున్న నిందితుడు...?

Ex army man meerpet murder case: మీర్ పేటలో మహిళ హత్య కేసులో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడు గురుమూర్తికి మరో మహిళతో అక్రమ సంబంధం వల్ల భార్యను హత్య చేశాడని విషయం వెలుగులోకి వచ్చింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Jan 24, 2025, 01:56 PM IST
  • మీర్ పేట మహిళ హత్య ఘటనలో మరో ట్విస్ట్..
  • తలలు పట్టుకుంటున్న పోలీసులు..
Gurumurthy Murder case: మీర్‌పేట మహిళ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. మరో మహిళతో యవ్వారం పెట్టుకున్న నిందితుడు...?

Meerpet murder case update: హైదరాబాద్ లో మీర్ పేట ఘటనలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్ లు వెలుగులోకి వస్తున్నాయి. సంక్రాంతి తర్వాత ఇంటికొచ్చిన పిల్లలు.. ఇంట్లో తీవ్ర దుర్వాసన వస్తుందని తండ్రిని ప్రశ్నించారు. ఈ క్రమంలో తండ్రి పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో ఈ ఘటనపై కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన బైటపడింది.

సంక్రాంతి పండక్కి ఊరు వెళ్లే విషయంలో దంపతులు మధ్యలో చెలరేగిన వివాదం.. మహిళ హత్యకు దారితీసింది. ఈ క్రమంలో మహిళ భర్త గతంలో ఆర్మీలో పనిచేశాడు. అతడు.. కట్టుకున్న భార్యను కుక్కర్ లో ఉడికించి, అత్యంత ఘోరంగా హతమార్చాడు. ఆతర్వాత శరీర భాగాలను.. చెరువులో తీసుకెళ్లి పడేశాడు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

గురుమూర్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులుకు పొంతనలేని సమాధానాలు చెప్తున్నాడు. ఇంట్లోని కొన్ని ఆనవాళ్లు.. తీసుకుని ఫోరెన్సీక్ టెస్టుల కోసం పంపించారు. ఈ కేసులో డీఎన్ఏ రిపోర్టు కీలకంగా మారిందని చెప్పుకొవచ్చు.  గురుమూర్తి భార్యను హత్య చేసేందుకు ఉపయోగించిన వస్తువుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.

Read more: Priyanka Chopra: మరో ప్రముఖ ఆలయాన్ని దర్శించుకున్న బాలీవుడ్ నటి.. వీడియో వైరల్..  

నిందితుడు గురు మూర్తికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని.. ముందుగానే వేసుకున్న స్కెచ్ ప్రకారం.. పిల్లల్ని పంపించి వేసి.. ఆ తర్వాత భార్యతో గొడవలు పడి క్రూరంగా హతమార్చినట్లు ఒక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో ప్రస్తుతం మరోసారి మీర్ పేట ఘటన సంచలనంగా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News