Kaveri Travel Bus Accident: రాజమహేంద్రవరం దగ్గర ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో ఓ యువతి మృతిచెందింది. 28 మంది గాయపడ్డారు. వీరిలో పదిమందికి తీవ్ర గాయాలు కాగా, మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.రాజమండ్రి శివారు గామన్ వంతెనపై అర్ధరాత్రి ఈ ప్రమాదం ఈ ఘటన చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు పోతున్న కావేరి ట్రావెల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, మద్యం మత్తులో ఉన్న కారణంగా అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. బస్సు బోల్తాపడిన విషయం తెలిసేసరికి జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు, ఇతర సహాయక సిబ్బంది అక్కడికి చేరుకునేలోపు గాయపడినవారు గంట పాటు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
రాజమహేంద్రవరం నుంచి ఆరు అంబులెన్సులు కాతేరు- కొంతమూరు మధ్య వంతెనపై ఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు తరలించారు. వీరంతా విశాఖ, అన్నవరం ప్రాంతాలకు చెందిన వారుగా తెలుస్తోంది. వీరిలో 25 ఏళ్లలోపు విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. క్రేన్ సాయంతో రాత్రి ఒంటి గంట సమయంలో బోల్తాపడిన బస్సును తొలగించి కింద ఉన్న మరి కొంతమందిని రక్షించారు. వారంతా బస్సు కింద ఖాళీ ప్రదేశంలో ఇరుక్కోవడంతో ప్రాణాలతో బయటపడగలిగారు.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
కొంతమూరు వద్ద వంతెనపై రిసేర్ వర్క్ జరుగుతుండడంతో ట్రాఫిక్‌ను దారిమళ్లించారు. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ దీనిని గుర్తించక ఆంటీ క్లాక్ దిశలోకి ఒక్కసారిగా మళ్లించడంతో పాటు.. అదే సమయంలో ఎదురుగా ఓ టూ వీలర్ వస్తుండటం... దానిని తప్పించే క్రమంలో బోల్తాపడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బస్సు ఇంకొంచెం ముందుకు వెళ్లాక అదుపు తప్పిఉంటే గోదావరి నదిలో పడిపోయే పరిస్థితి ఉండేదని తెలుస్తోంది. ఘటనతో గామన్ వంతెనపై ఇరువైపులా రెండు గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ఆ దారిన పోయేవాళ్లు నరకం అనుభవించారనే చెప్పాలి.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.