JanaSena Party: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు భారీ శుభవార్త. పార్టీకి సంబంధించిన గుర్తును రిజర్వ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఎన్నికల్లో తీవ్ర వివాదాస్పదంగా ఉన్న గాజు గ్లాస్ గుర్తును ఎట్టకేలకు జనసేనకు రిజర్వ్ చేయడంతో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గాజు గ్లాస్ అంటేనే జనసేన అనే స్థాయిలో గుర్తింపు లభించిన వేళ ఎన్నికల సమయంలో ఈ గుర్తు జనసేనకు దక్కుతుందా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. తాత్కాలికంగా ఆ సమయంలో గ్లాస్ గుర్తు జనసేనకు దక్కగా తాజాగా ఇప్పుడు పూర్తిగా రిజర్వ్ చేయడంతో జనసేన హర్షిస్తోంది.
Also Read: Liquor Shops: ఏపీలో మళ్లీ వైన్స్ దుకాణాలకు దరఖాస్తులు.. అదృష్టం పరీక్షించుకోండి
పవన్ కల్యాణ్‌కు లేఖ
జనసేనకు గాజు గ్లాసు గుర్తు రిజర్వ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆ లేఖను పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు పంపించింది. ఈ విషయాన్ని జనసేన అధికారికంగా ప్రకటించింది. జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసింది. రిజర్వ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం లేఖ అందించింది.
Also Read: IPS Officers Transfers: పవన్ కల్యాణ్ దెబ్బ అదుర్స్.. కాకినాడ జిల్లా ఎస్పీ బదిలీ
శాశ్వత గుర్తు
గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 100 శాతం విజయం నమోదు చేసిన పార్టీగా జనసేన రికార్డు సాధించిన విషయం తెలిసిందే. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో.. 2 లోక్‌సభ స్థానాల్లో జనసేన పార్టీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుని అరుదైన ఘనతను సాధించింది. అంతటి విజయం సాధించిన జనసేన పార్టీని గుర్తింపు పొందిన పార్టీగా ఎన్నికల సంఘం గుర్తిస్తూ.. అందులో భాగంగా గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసింది. గుర్తు రిజర్వ్ చేయడంతో ఇకపై గాజు గ్లాస్ గుర్తు ఇతర ఏ పార్టీకి.. అభ్యర్థికి కేటాయించలేరు. ఏ ఎన్నిక జరిగిన కూడా జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు లభిస్తుంది.
కనీస ప్రాతినిథ్యం లేక..
జనసేన పార్టీ స్థాపించి దాదాపు దశాబ్దం దాటింది. 2023కు ముందు జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీకి కనీస ప్రాతినిధ్యం కూడా దక్కలేదు. పోటీ చేసిన స్థానాల్లో ఒక్క చోట మినహా ఎక్కడ గెలవలేని విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రతిసారి ఎన్నికల సమయంలో జనసేన పార్టీకి గాజు గ్లాస్ ఉంటుందా? లేదా అనే ఉత్కంఠ ఉండేది. గతేడాది జరిగిన ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించడంతో జనసేన పార్టీకి ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది.
కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీగా జనసేన
• జనసేనకు గాజు గ్లాసు గుర్తు రిజర్వ్ చేసిన ఎన్నికల సంఘం
జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసింది. ఈ మేరకు కేంద్ర… pic.twitter.com/8w1DM05DVP
— JanaSena Party (@JanaSenaParty) January 21, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.