Kumbh mela ki viral girl Monalisa got movie offer: ప్రయాగ్ రాజ్ కుంభమేళలకు కోట్లాదిగా భక్తులు తరలి వస్తున్నారు. దాదాపు.. 144 సంవత్సరాల తర్వాత ఏర్పడిన మహా కుంభమేళ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా భక్తులు పుణ్యస్నానాలకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుంభమేళలో సాధులు, సంత్ లు, అఘోరీలు భారీగా తరలి వస్తున్నారు. కుంభమేళలో సాధులు, వెరైటీ అఘోరీలు దర్శనమిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది కుంభమేళలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.
కుంభమేళలో.. ప్రయాగ్ రాజ్ లో ఐఐటీ బాబా, గ్లామరస్ సాధ్వీ హర్షరిచారియా, రష్యన్ కు చెందిన బాహుబలి బాబా, ఛోటు బాబా లు వార్తలలో ఉంటున్నారు. ముఖ్యంగా కుంభమేళలో తేనె కళ్ల అమ్మాయి.. మోనాలీసా ఒక్కసారిగా ఫెమస్ అయిపోయారు. సోషల్ మీడియాలో ఆమె ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయారు. ఆమెను ఇంటర్వ్యూ చేయడం కోసం అనేక మీడియాలు, యూట్యూబ్ ఛానెల్స్ పొటీపడ్డాయి. మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ కుచెందిన మోనాలీసా కుటుంబం కుంభమేళలో..
మహా కుంభమేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముకుంటూ.. పొట్టకూటి కోసం కష్టపడుతున్నారు. ఈ క్రమంలో ఆమెను కొంత మంది ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఓవర్ నైత్ లో సోషల్ క్వీన్ గా మారిపోయింది. ఆమెతో ఫోటో దిగేందుకు కుంభమేళలో జనాలు క్యూలు కట్టారు. ఇదిలా ఉండగా.. వైరల్ గర్ల్ మోనాలీసాలకు మూవీస్ లో అవకాశం ఇచ్చేందుకు... బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ముందుకు వచ్చారు.
ఆమె ఎంతో నేచురల్ గా ఉన్నారని.. తన తదుపరి మూవీలో ఆమెకు హీరోయిన్ గా అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. ఒక వేళ ఆమెకు నటన రాకుంటే.. ట్రైనింగ్ ఇప్పించి మరీ ఆమెతో చేయిస్తానని కూడా డైరెక్టర్ క్లారీటీ ఇచ్చారు.
Read more: Naga Sadhu: ఒక వ్యక్తి నాగ సాధువుగా ఎలా అవుతాడు.. శాస్త్రాలు ఏం చెబుతున్నాయి..!
ఈక్రమంలోనే డైరెక్టర్ సనోజ్ మిశ్రా.. తన తర్వాతి సినిమా అయినా "డైరీ ఆఫ్ మణిపూర్"లో మోనాలిసాను తీసుకోబోతున్నట్లు తెలిపారు. ఇలాంటి అమ్మాయి కోసమే చాలా కాలంగా వెతుకుతున్నానని.. రైతు కూతురి పాత్రకు మోనాలిసా బాగా సెట్ అవుతుందంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే త్వరలోనే కుంభమేళాకు వెళ్లి ఆమెను కలుస్తానని.. సినిమాలో నటించేందుకు ఆమె ఒప్పుకుంటే.. ఆ తర్వాత ముందుకు వెళ్తామని డైరెక్టర్ ట్వీట్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter