SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ ఎడమ టన్నెల్ వద్ద ఈరోజు ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేస్తున్న సమయంలో పైకప్పు ఊడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో అక్కడ దాదాపు 40 మంది వరకు కార్మికులు చిక్కుకుపోయారు. 14 కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఇందులో చిక్కుకున్న కార్మికులంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. టన్నెల్ పై భాగంలో మూడు మీటర్ల మేర కూలిపోయింది అని తెలుస్తోంది. ఇప్పటికే అధికారులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. నలుగురు కార్మికులను బయటకు తీశారు. వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రమాద స్థలానికి చేరుకుంటున్నారు. ఆయన ఈ ప్రమాదంపై ఇప్పటికి ఆరా తీశారు. నాలుగు రోజుల క్రితమే పనులు త్వరగా పూర్తిచేయాలని ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు పనులను చేపట్టింది. అంతలోనే ఈ ఘోరం చోటు చేసుకుంది.. ఈ పనులు నాగర్‌కర్నూల్ జిల్లాలోని దోమలు పెంట సమీపంలో జరుగుతున్నాయి.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నెల్ వద్ద పైకప్పు కూలి పలువురికి గాయాలైన సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి గారు అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం…
— Telangana CMO (@TelanganaCMO) February 22, 2025
ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదం గురించి తెలుసుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు తగిన సూచనలు చేశారు. ప్రాజెక్టు పనుల్లో జరిగిన ప్రమాదంపై ఆరాతీసి అగ్నిమాపక శాఖ, ఇరిగేషన్ అధికారులను కూడా వెంటనే స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్నో దశాబ్దాల పోరాటం వల్ల ఈ ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు ప్రారంభం అయింది.. నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నల్గొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగు, తాగునీటిని అందించడానికి ఈ ప్రాజెక్టును ప్రారంభించారు
ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2005వ సంవత్సరంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారానే నల్గొండ ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు కూడా తాగునీరును అందించడానే లక్ష్యంగా మొదలైంది. SLBC ప్రాజెక్టుకు మొదట దాదాపు రూ. 1920 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. పనులు పూర్తయ్యేసరికి రూ.3000 కోట్లకు పైగా అవసరమయ్యే అవకాశం ఉందని ఇటీవల అంచనా వేశారు.
ఈ ప్రాజెక్టు పనుల్లో భాగంగా 44 కిలోమీటర్ల మేర ఇన్ లెట్, అవుట్‌లెట్ పనుల్లో భాగంగా తవ్వకాలు చేపట్టాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు 34 కిలోమీటర్ల మేర పూర్తయింది. కాగా 14వ కిలోమీటర్ వద్ద ఈరోజు ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది ఇంకా 10 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇంతలోనే ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదం ఉదయం 8 గంటలు దాటిన తర్వాత జరిగినట్లు తెలుస్తోంది. తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సీఎం రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి నల్గొండ జిల్లాలకు 30 టీఎంసీల నీరు తరలించాలని ప్రధాన ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు.. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ నుంచి సారంగం ప్రాజెక్టును పూర్తి చేస్తున్నారు. వీటిని సాగు, తాగు నీటి అవసరాలకు ఆయా జిల్లాల్లో ఉపయోగించనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter