Megastar tweet on his mother hospitalised rumors: మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవీ తీవ్ర అస్వస్థకు గురయ్యారని ఉదయం నుంచి వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారాయి. తెల్లవారు జామున అంజనా దేవీకి ఛాతీలో నొప్పి వచ్చిందని, ఆమెను హుటా హుటీన ఆస్పత్రికి తీసుకెళ్లారని వార్తలు జోరుగా ప్రచారం జరిగాయి. అంతేకాకుండా.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం విజయవాడ నుంచి తన కార్యక్రమాలన్ని క్యాన్సిల్ చేసుకుని, స్పెషల్ ఫ్లైట్ లో హైదరబాద్ కు బయలు దేరారని ప్రచారం జరిగింది. మరొవైపు దుబాయ్ లో ఉన్న చిరు కూడా.. ప్రత్యేక విమానంలో హైదరబాద్ చేరుకుంటున్నారని వార్తలు తెగ వైరల్గా మారాయి.
My attention is drawn to some media reports claiming our mother is unwell and is hospitalised. Want to clarify that she was a little indisposed for a couple of days. She is hale and hearty and is perfectly alright now.
Appeal to all media not to publish any speculative reports…
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 21, 2025
దీనిపై తాజాగా.. మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. దీనిపై ఆయన తన తల్లి అంజనా దేవీ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. తన తల్లికి ఎలాంటి అస్వస్థకు గురికాలేదని అన్నారు. తాను సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నారన్నారు. తన తల్లి అనారోగ్యంగా ఉందని దయచేసి ఊహజనితమైన వార్తలు వ్యాప్తి చేయోద్దని మెగాస్టార్ సంచలన ట్విట్ చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం చిరు తల్లి అనారోగ్యంపై వస్తున్న వార్తలకు ఎండ్ కార్డ్ పడింది.
మరొవైపు అభిమానులు సైతం.. ఏకంగా మెగాస్టార్ దీనిపై రియాక్ట్ కావడంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మొత్తంగా ఉదయం నుంచి ఎంతో టెన్షన్గా ఉన్న అభిమానులకు మెగాస్టార్ పెట్టిన ఒక్క ట్విట్ బిగ్ రిలీఫ్ ఇచ్చిందని చెప్పుకొవచ్చు.
అయితే.. ఉదయం నుంచి మీడియాలో వస్తున్న వార్తల్ని చూసి.. చిరు సన్నిహితులు, రాజకీయ నేతలు సైతం.. ఆయనకు మెస్సెజ్ లు, ఫోన్స్ చేశారని కూడా వార్తలు సమాచారం. అందుకే ఏకంగా మెగాస్టార్ చిరంజీవి దీనిపై తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టి రూమర్స్ కు చెక్ పెట్టేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి