APPSC Group 2 Mains: రేపే ఏపీ గ్రూపు 2 పరీక్ష.. వాయిదా కోసం నిరుద్యోగుల ఆందోళన ఉధృతం

APPSC Group 2 Mains Candidates Continues Protest AP Govt Likely To Postpone Exams: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులు ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. గ్రూపు 2 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా వేయాలని ఉద్యమాన్ని తీవ్రం చేశారు. రేపే పరీక్షలు ఉండడంతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందా? అనేది ఉత్కంఠ నెలకొంది. 

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 22, 2025, 02:54 PM IST
APPSC Group 2 Mains: రేపే ఏపీ గ్రూపు 2 పరీక్ష.. వాయిదా కోసం నిరుద్యోగుల ఆందోళన ఉధృతం

APPSC Group 2 Mains Candidates Protest: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న పరీక్షల విధానాల్లో లోపాలను మార్చాలని గ్రూపు 2 అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. రేపే మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభమవుతుండగా.. నిరుద్యోగులు మాత్రం ఆందోళనను విరమించుకోవడం లేదు. హైదరాబాద్‌లోని  అశోక్‌నగర్‌లో ఉన్న స్టడీ కేంద్రాల వద్ద రోడ్డుపై బైఠాయించి నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన చేపడుతున్నారు. ఏపీ గ్రూప్ 2 అభ్యర్థుల పరీక్షల రోస్టర్ విధానంలో ఉన్న లోపాలను సరిచేసి పరీక్షలు నిర్వహించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: IPS Officers: తెలంగాణ ఐపీఎస్‌ అధికారులకు షాక్‌.. ఏపీలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశం

గత ప్రభుత్వం చేసిన లోపాలను మళ్లీ ఈ ప్రభుత్వం చేయవద్దని గ్రూపు 2 అభ్యర్థులు ప్రార్థిస్తున్నారు. గ్రూప్ 2 మెయిన్స్ లోని రోస్టర్ విధానంలో లోపాలను తప్పులు సరిచేసి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈనెల 23వ తేదీన మెయిన్స్‌ పరీక్షలు ఉండడంతో వెంటనే రోస్టర్ విధానంలో ఉన్న తప్పులను సరిదిద్ధి పరీక్షలు నిర్వహించాలని ఈ సందర్భంగా నిరుద్యోగులు విజ్ఞప్తి చేశారు. 995 పోస్టులకు 91 వేలమంది అభ్యర్థులు ప్రిపేర్ అయ్యారని.. పరీక్షలను వాయిదా అడగట్లేదు, లోపాలను సరిదిద్ది పరీక్షలు ఎప్పుడు పెట్టినా తమకు అభ్యంతరం లేదని నిరుద్యోగులు విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగ అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడవద్దని హెచ్చరించారు.

Also Read: Tirumala Dispute: తిరుమలలో సమసిన వివాదం.. 'థర్డ్‌ క్లాస్‌' వ్యాఖ్యలకు క్షమాపణ

రోస్టర్ లో ఉన్న లోపాలను సరిదిద్దకపోతే  ఉద్యోగ భద్రత ఉండదని గ్రూపు 2 మెయిన్స్‌ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగం వచ్చాక కూడా  భద్రత లేదని వాపోతున్నారు. పరీక్షలు రాశాక ఉద్యోగం వస్తుందో రాదో.. ఉద్యోగం వచ్చాక కూడా ఉద్యోగ భద్రత ఉండని పరిస్థితుల్లో పరీక్షలు రాసి ఏమి ప్రయోజనమని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో శిక్షణ పొందుతున్న ఏపీ నిరుద్యోగులు ఆందోళన చేపడుతుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో కూడా గ్రూపు 2 అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News