Indiramma Illu: వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పొలేపల్లిలోని రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి నారాయణపేట జిల్లా అప్పక్‌పల్లికి చేరుకుంటారు. అక్కడ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. నారాయణపేట వైద్య కళాశాలలో అకడమిక్ బ్లాక్‌తో పాటు ఇతర భవనాలకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం నారాయణపేటలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ పథకాన్ని ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలలో మాత్రమే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగతా ఏడు పాత జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పథకాన్ని ప్రారంభిస్తారు. ప్రభుత్వం ఏటా నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించింది. గరిష్ఠంగా ఏడాదికి 4.50 లక్షల ఇళ్లను ఇవ్వనుంది.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
జనవరి 26న ప్రభుత్వం రాష్ట్రంలో నాలుగు పథకాలకు దరఖాస్తులు తీసుకుంది. ఇందులో ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా ఉంది. దీనికి మొత్తం 80 లక్షల దాకా దరఖాస్తులు వచ్చాయి. మొదటి విడతలో మండలానికి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి మొత్తం 72,045 ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్వేయర్లు ప్రతి దరఖాస్తుదారు ఇంటికి వెళ్లి విచారించారు. ఇప్పటికే లబ్ధిదారులతో ప్రీ గ్రౌడింగ్ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇంటి నిర్మాణానికి 4 విడతల్లో లబ్ధిదారుకి రూ.5 లక్షలను అందిస్తారు.
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.